సునీల్‌ని వాళ్లిద్దరే తొక్కేస్తున్నారు!

సునీల్‌ని వాళ్లిద్దరే తొక్కేస్తున్నారు!

కమెడియన్‌గా సునీల్‌ స్లాట్‌ ఖాళీ అయిన తర్వాత ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి పలువురు కమెడియన్లు చాలా ట్రై చేసారు. ఎన్నో ఏళ్ల తర్వాత వెన్నెల కిషోర్‌కి ఆ స్థానం సొంతం చేసుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండించే వెన్నెల కిషోర్‌ పంచ్‌ డైలాగుల కంటే సిట్యువేషనల్‌ పంచ్‌ల మీదే కామెడీ చేస్తుంటాడు. ఇంప్రొవైజేషన్‌ కూడా బాగా తెలుసు కనుక వెన్నెల కిషోర్‌ని చాలా మంది దర్శకులు ప్రిఫర్‌ చేస్తున్నారు.

వెన్నెల కిషోర్‌తో పాటుగా తనదైన ముద్ర వేసిన మరో కమెడియన్‌ సత్య. స్వామిరారాతో పరిచయమయిన సత్య ప్రతి వేషంతోను ఎంతో కొంత ఇంప్రెస్‌ చేయగలడు. అతనికి వెన్నెల కిషోర్‌లా స్టార్‌ స్టాటస్‌ రాలేదు కానీ సత్య కోసం పాత్రలు రాసే దర్శకులు కొందరున్నారు. హీరోకి సపోర్ట్‌గా కనిపించే పాత్రలు చేసిన సునీల్‌ ఇప్పటికీ అలాంటి పాత్రల కోసమే చూస్తున్నాడు కానీ యువ హీరోల పక్కన వీళ్లిద్దరే బెస్ట్‌ అని ఎక్కువ మంది దర్శకులు భావిస్తూ వుండడంతో సునీల్‌కి ఎక్కువ ఛాన్స్‌లు రావడం లేదు.

తాను హీరోయిజం మానేసి కామెడీ మొదలు పెడితే తిరిగి పూర్వ వైభవం ఖాయమని అనుకున్న సునీల్‌కి ఇప్పుడు కమెడియన్‌గా ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో బాగా డీలా పడ్డాడు. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ తీసే సినిమాలోను, గోపిచంద్‌ నటిస్తోన్న 'చాణక్య'లోను మంచి రోల్స్‌ పడ్డాయంటున్నారు. మరి వాటితో తిరిగి సునీల్‌ హవా స్టార్ట్‌ అవుతుందో లేదో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English