ఈయన రాజమౌళికి సవాలు విసురుతాడా?

ఈయన రాజమౌళికి సవాలు విసురుతాడా?

‘మహాభారతం’ తీయడానికి తగిన అనుభవం సంపాదించడానికి తనకు ఇంకో పదేళ్లు పడుతుందని రాజమౌళి మూడేళ్ల కిందట ప్రకటించాడు. ఎప్పటికైనా ‘మహాభారతం’ తీస్తానని.. అది తన కలల ప్రాజెక్టు అని జక్కన్న ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఐతే అతను చెప్పినట్లు మరీ పదేళ్లు ఎదురు చూడాలంటే అభిమానులకు ఇబ్బందే. ఈ లోపు వివిధ ఇండస్ట్రీల్లో ‘మహాభారతం’ మీద సినిమాలు అనౌన్స్ అయిపోతున్నాయి. ఆమిర్ ఖాన్, మోహన్ లాల్ లాంటి వాళ్లు మహాభారతాన్ని తెరమీదికి తెచ్చేందుకు తెగ ఉత్సాహం చూపించారు.

ఐతే వాళ్ల ఉత్సాహానికి తగ్గట్లుగా ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. మోహన్‌ లాల్‌తో అనుకున్న వెయ్యి కోట్ల ‘మహాభారతం’ అటకెక్కేసింది. ఆమిర్ ఖాన్ ‘మహాభారతం’ సైతం ముందు వెనుక అన్నట్లుగా ఉంది. ముందు సినిమాగా తీయాలనుకున్న ఈ కథను ఇప్పుడాయన వెబ్ సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తునన్నాయి.

ఇంతలో ఇప్పుడు మరొకరు ‘మహాభారతం’ మీద సిినమా అంటూ ముందుకొచ్చారు. ఆయనే రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. ‘రంగ్ దె బసంతి’, ‘బాగ్ మిల్కా బాగ్’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మెహ్రా.. ‘మహాభారత్’ పేరుతో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించాడు ఫిలిం ఛాంబర్లో. దీంతో ఈ కథతో ఆయన కూడా సినిమా తీయబోతున్నాడని స్పష్టం అయిపోయింది. ఈ మధ్య రాకేష్ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదు కానీ.. బాలీవుడ్లో గొప్ప ఫిలిం మేకర్స్‌లో ఆయనొకరు. కానీ ‘మహాభారతం’ లాంటి భారీ కథను ఆయన జనరంజకంగా తీర్చిదిద్దగలడా అన్నది డౌటు.

ఎవరు ‘మహాభారతం’ మీద సినిమా తీయబోతున్నట్లు సంకేతాలిచ్చినా.. రాజమౌళికి ఇబ్బంది కదా అనే చర్చ నడుస్తోంది. కానీ జక్కన్న విజన్.. కాన్వాస్ ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరు ఏ స్థాయిలో తీసినా.. దాన్ని మించిన పెద్ద కాన్వాస్‌లో జక్కన్న ‘మహాభారతం’ను ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి ఎవరు ‘మహాభారతం’ సినిమాను అనౌన్స్ చేసినా జక్కన్న ఫ్యాన్స్ పెద్దగా ఫీలవ్వాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English