బాలయ్య గెటప్‌కి తగ్గ సెటప్‌

బాలయ్య గెటప్‌కి తగ్గ సెటప్‌

ఎన్నికల ఫలితాలు రాకముందు కె.ఎస్‌. రవికుమార్‌ చెప్పిన కథ విని ఓకే చేసిన బాలకృష్ణ అందులోని ఒక పాత్ర కోసం గడ్డం పెంచి ఒక గెటప్‌ రెడీ చేసారు. తీరా ఎన్నికలలో జగన్‌ గెలవడంతో సదరు చిత్రంలోని విలన్‌ పాత్ర జగన్‌, రాజారెడ్డి పాత్రల పోలికలతో వుందనే కారణం మీద కథ మార్చేసారని చెప్పుకున్నారు. అసలయితే విలన్‌గా జగపతిబాబు డ్యూయల్‌ రోల్‌ చేయాల్సింది కానీ కథ మార్చేయడంతో ఇప్పుడు జగపతికి చోటుందో లేదో తెలియదు. అయితే గెటప్‌ మార్చిన బాలకృష్ణ అదే గెటప్‌కి సూటయ్యే సెటప్‌ కావాలని చెప్పడంతో ఆయన గెటప్‌ మార్చాల్సిన పని లేకుండా కథ సిద్ధం చేసారట.

మొదట అనుకున్న కథకీ, దీనికీ పోలిక లేకపోయినా కానీ గెటప్‌ అయితే అదే వుంటుందట. బహుశా హీరో గెటప్‌కి అనుగుణంగా కథ రాసుకున్న సినిమా ఇదే అవుతుందేమో. ఇదిలావుంటే బాలకృష్ణ ఇటీవల తన క్లోజ్‌ సర్కిల్‌కి దూరంగా వుంటున్నారని, అభిమానులతో కూడా అంతగా మంతనాలు సాగించడం లేదని, పుట్టినరోజుకి కూడా సంబరాలు జరుపుకోలేదని, ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఫెయిల్యూర్‌తో పాటు తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం బాలయ్యపై బాగా ప్రభావం చూపించిందని చెప్పుకుంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English