బాప్‌రే... అరడజను సినిమాలా?

బాప్‌రే... అరడజను సినిమాలా?

పెద్ద సినిమాలేవీ దగ్గర్లో లేకపోవడంతో చిన్న నిర్మాతలంతా ఇప్పుడు గ్యాంబ్లింగ్‌ మోడ్‌లో వున్నారు. ఏ సినిమాకి వసూళ్లు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో 'మా సినిమా ఆడుతుందంటే మాది ఆడుతుంది' అంటూ వేలంవెర్రిగా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరడజను స్ట్రెయిట్‌ సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి తోడు కొన్ని అనువాద చిత్రాలు కూడా వున్నాయి. వీటిలో ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ, మల్లేశం చిత్రాలు ఇప్పటికే జనం దృష్టిలో పడ్డాయి. ఇంకా ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు చిత్రాన్ని కూడా బాగానే ప్రమోట్‌ చేస్తున్నారు.

చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిపోయిన విష్ణు సినిమా 'ఓటర్‌'తో పాటు 'స్పెషల్‌', 'స్టువర్ట్‌పురం' చిత్రాలు కూడా శుక్రవారమే విడుదల చేస్తున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్య జనం ఎన్నిటిని పట్టించుకుంటారో తెలియదు. గత రెండు, మూడు వారాలుగా అయితే వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోతున్నాయి తప్ప నిలబడడం లేదు. కాస్త బాగున్నాయనే పేరొచ్చిన సినిమాలకి కూడా పెద్దగా వసూళ్లు రావడం లేదు. జులైలో మళ్లీ ప్రతి శుక్రవారం నాడు ఏదో ఒక నోటెడ్‌ సినిమా వుంది కనుక చిన్న సినిమాల మధ్య అదృష్టం పరీక్షించుకోవడమే మేలనుకుని వుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English