పృధ్వీని గెంటేసిన అల్లు అర్జున్‌

పృధ్వీని గెంటేసిన అల్లు అర్జున్‌

ప్రతి హీరోతోను మంచి సంబంధాలుంటే తప్ప కమెడియన్లకి తగినన్ని అవకాశాలు రావు. అందుకే దాదాపుగా అందరు హీరోలను కాకా పడుతూ తమకో మంచి వేషం ఇప్పించమని సీజన్డ్‌ ఆర్టిస్టులు కూడా అడుగుతుంటారు. అలాంటిది కమెడియన్‌ అయి వుండీ రాజకీయాల మీద మక్కువతో మెగా ఫ్యామిలీతో సున్నం పెట్టుకున్నాడు థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ. వైసిపి తరఫున ప్రచారం చేసిన పృధ్వీ వైరి పక్షమయిన పవన్‌కళ్యాణ్‌పై చాలానే కామెంట్లు చేసాడు. ఒక్కోసారి గీత దాటాడు కూడా. అలీలాంటి వాళ్లు లౌక్యంగా ఎలాంటి నెగెటివ్‌ కామెంట్లు లేకుండా తమ పార్టీకి ప్రచారం చేసుకుంటే పృధ్వీ మాత్రం ఆవేశంతో ఊగిపోయి చాలా తప్పులు చేసాడు.

ఇప్పుడు అవన్నీ అతని సినిమా కెరియర్‌కి ప్రతిబంధకంగా మారాయి. పృధ్వీకి ఖచ్చితంగా మంచి వేషం ఇచ్చే త్రివిక్రమ్‌ ఇప్పుడతడి పాత్రని తన సినిమా నుంచి తొలగించాడు. అతడికి తన సినిమాలో చోటు లేదని అల్లు అర్జున్‌ తేల్చి చెప్పడంతో త్రివిక్రమ్‌ ఒప్పుకోక తప్పలేదు. ఇలాగే మిగతా మెగా హీరోల సినిమాలలోను పృధ్వీకి ఛాన్స్‌లు రాకపోవచ్చు. ఎంత రాజకీయం మీద పిచ్చి వున్నా అంత మంది హీరోలున్న ఫ్యామిలీపై కాలు దువ్వడం మంచిది కాదని పృధ్వీకి ఏ క్షణంలోను అనిపించకపోవడం ఏమిటో... విడ్డూరం కాకపోతేను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English