డైరెక్టర్‌ భార్య గోలతో నాగార్జునకి తలనొప్పి!

డైరెక్టర్‌ భార్య గోలతో నాగార్జునకి తలనొప్పి!

మన్మథుడు 2 టీజర్‌కి యాభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చి ట్రెండింగ్‌లో వుండడం, టీజర్‌కి భలే రెస్పాన్స్‌ రావడంతో నాగార్జున చాలా హ్యాపీగా వున్నాడు. అయితే ఈ చిత్రానికి నెగెటివిటీ ఊహించని వైపునుంచి వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడయిన రాహుల్‌ రవీంద్రన్‌ సింగర్‌ చిన్మయి భర్త కావడమే అందుకు కారణం.

మీటూ అంటూ చిత్ర సీమలో ఆడవాళ్లు హడావుడి చేసిన టైమ్‌లో తమిళ చిత్ర సీమలోని పలువురు పెద్దల పేర్లని ఆధారాలు లేకుండా బయటకి లాగి రచ్చ చేసిన చిన్మయి ఆ తర్వాత కూడా సోషల్‌ మీడియాలో మహిళల హక్కులు, వారిపట్ల వివక్ష అంటూ పెద్ద స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ వుంటుంది. కూతురి వయసు హీరోయిన్లతో హీరోలు నటించడం ఎప్పటికి మారుతుందో అని అప్పట్లో ఆమె ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తన భర్త తీసిన సినిమాలో నాగార్జున సరసన రకుల్‌ నటించడం ఏమిటని చిన్మయిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

అలాగే ఈ టీజర్‌లో ఆడవాళ్లని సెక్స్‌ టాయ్స్‌గా చూపించారని, కానీ ఈ టీజర్‌కి వస్తోన్న స్పందనని చిన్మయి ఎంజాయ్‌ చేస్తోందే తప్ప తన భర్త కూడా అందరు మగాళ్లలాంటి వాడేనని విమర్శించడం లేదని ఆమెని వేలెత్తి చూపుతున్నారు. దీనికి రాహుల్‌ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. అయితే ఈ గోలలో తన సినిమా పట్ల లేని పోని నెగెటివిటీ స్ప్రెడ్‌ అవుతోందని నాగార్జున వర్రీ అవుతున్నాడని, 'ఇదేమిటి' అంటూ రాహుల్‌ రవీంద్రన్‌ని కూడా గట్టిగానే అడిగాడని గుసగుసలాడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English