డైరెక్టర్‌ తేజ మాయలో కాజల్‌ అగర్వాల్‌!

డైరెక్టర్‌ తేజ మాయలో కాజల్‌ అగర్వాల్‌!

హీరోయిన్‌గా తనకి తొలి అవకాశం ఇచ్చిన తేజ అంటే కాజల్‌కి మహా గౌరవం. తను పరిచయం చేసిన వారిలో ఇప్పటికీ కృతజ్ఞత చూపించే వారిలో కాజల్‌ ముందు వుంటుంది అని తేజ కూడా చెబుతుంటాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత అతని దర్శకత్వంలో ఏరి కోరి 'సీత' చేసింది కాజల్‌. అయితే ఆ సినిమా బోల్తా కొట్టింది. డిజాస్టర్‌ అయినా కానీ 'సీత' గొప్ప సినిమానే అని కాజల్‌ భావిస్తోంది. అందుకే త్వరలోనే అతనితో మరో లేడీ ఓరియెంటెండ్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయింది. ఇంకా విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయడానికి కూడా కాజల్‌ సిద్ధంగా వుంది.

తేజ ఒకప్పుడు సంచలన దర్శకుడే కానీ గత పదమూడేళ్లలో అతనికి 'నేనే రాజు నేనే మంత్రి' తప్ప హిట్‌ లేదు. ఆ సినిమా కూడా ఎందుకు ఆడిందనే దానికి చాలా కారణాలున్నాయి. సీత సినిమాతో తేజ ఎంతగా ఆఫ్‌ ట్రాక్‌ వున్నాడనేది క్లియర్‌గా తెలిసినా కానీ కాజల్‌ తన 'గురువు' బలహీనతలని చూడలేకపోతోంది. ఆయనలో ఇప్పటికీ భారీ బ్లాక్‌బస్టర్‌ తీసే సత్తా వుందని నమ్ముతోంది. అయితే అందుకోసం తన డేట్స్‌ మాత్రం ఇస్తే సరిపోతుంది కానీ ఇలా నిర్మాతగా మారి సొంత డబ్బులు రిస్క్‌ చేయడం దేనికని కాజల్‌ ఫాన్స్‌ ఆత్మ ఘోషిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English