సాహో ట్రెయిలర్‌పై మిగతా సినిమాల జాతకాలు

సాహో ట్రెయిలర్‌పై మిగతా సినిమాల జాతకాలు

సాహో చిత్రానికి వున్న క్రేజ్‌ ఏమిటనేది శాంపిల్‌ ఇచ్చినట్టుగా టీజర్‌ అలజడి సృష్టించింది. రికార్డ్‌ స్థాయిలో దేశ వ్యాప్తంగా అందరూ ఈ టీజర్‌ని వీక్షించడంతోనే 'బాహుబలి' హీరో తదుపరి చిత్రంపై ఎలాంటి అంచనాలున్నాయనేది స్పష్టమయింది. రాజమౌళి బ్రాండ్‌ లేదు కనుక సాహోని సగటు ప్రభాస్‌ సినిమాగానే పరిగణించాలని చిత్ర పరిశ్రమ భావించింది. అంటే మిగతా అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతోంటే ఎంత స్పేస్‌ ఇవ్వాలో అంత స్పేస్‌ ఇస్తే చాలని అనుకున్నారు.

కానీ సాహోకి వున్న క్రేజ్‌ ఏమిటో టీజర్‌తో ఐడియా వచ్చిన తర్వాత దీంతో పోటీకి వెళ్లాలా లేక బాహుబలికి ఇచ్చినట్టుగా అటు, ఇటు కూడా స్పేస్‌ ఇచ్చేయాలా అని ఆలోచనలో పడ్డారు. అయితే రిలీజ్‌ డేట్స్‌ మార్చుకుంటే మళ్లీ డేట్‌ దొరకడం అంత ఈజీ కాదు కనుక కొందరు ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే వున్నారు. సాహో ట్రెయిలర్‌ రిలీజ్‌ అయితే అసలు సినిమా ఎలా వుంటుంది, ఏ రేంజ్‌కి వెళుతుంది అనేదానిపై అంచనా వేయవచ్చునని, ట్రెయిలర్‌ కనుక సినిమాపై అంచనాలు మరింత పెంచేలా వుంటే సాహోకి దూరంగా వుండడమే మంచిదని అనుకుంటున్నారు. సాహో ట్రెయిలర్‌ రిలీజ్‌ అయ్యాక చాలా చిత్రాల రిలీజ్‌ డేట్లు మారతాయని సినిమా ట్రేడ్‌లో వున్న వారు కూడా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English