‘సాహో’ బ్యాగ్రౌండ్ అతనే.. మరి ఫ్రంటు?

‘సాహో’ బ్యాగ్రౌండ్ అతనే.. మరి ఫ్రంటు?

మొత్తానికి ‘సాహో’ టీం నుంచి ఒక విషయంలో స్పష్టత వచ్చింది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ జిబ్రానే అందించబోతున్నాడు. ‘సాహో’ మేకింగ్ వీడియోల్లో రెండో దానికి జిబ్రానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌కు ఆర్ఆర్ సమకూర్చింది కూడా అతనే. ఈ టీజర్ రెండో అర్ధంలో వచ్చే సౌండ్లకు జనాల మతులు పోయాయి.

విజువల్స్‌ను మరింతగా ఎలివేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పించాడతను. ఈ పనితనం చూశాక సినిమాకు కూడా అతనే బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూరుస్తాడని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని యువి క్రియేషన్స్ ధ్రువీకరిస్తూ అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ పాటల సంగతేంటన్నది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు.

‘సాహో’ విడుదలకు ఇంకో రెండు నెలలు కూడా సమయం లేదు. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా ఎంపికైన శంకర్-ఎహసాన్-లాయ్ ఇటీవలే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సూటయ్యే ఎనర్జిటిక్ సాంగ్స్ వాళ్లు ఇవ్వలేకపోయారని.. దీంతో దర్శకుడు సుజీత్ వాళ్లను పక్కన పెట్టేశాడని.. అందుకే మేకింగ్ వీడియోలకు తమన్, జిబ్రాన్‌లతో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి.

'సాహో’ ప్రోమోలు ఇప్పటిదాకా గమనిస్తే పాటలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేలా కనిపించడం లేదు. నేపథ్య సంగీతమే కీలకం. ఆ బాధ్యత జిబ్రాన్‌కు అప్పగించేశారు. ఆ పాటల పని కూడా అతడికే ఇచ్చేస్తే పోయేదేమో. విడుదలకు ఇంకో రెండు నెలలు కూడా సమయం లేని నేపథ్యంలో ఇంకెప్పుడు సంగీత దర్శకుడిని ఎంపిక చేస్తారు.. పాటలెప్పుడు చేయించుకుంటారు.. వాటిని ఎప్పుడు చిత్రీకరిస్తారు అన్నది అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English