ఆ హీరో చేసిన దారుణమైన తప్పు

ఆ హీరో చేసిన దారుణమైన తప్పు

దక్షిణాదిన ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో చాలా పెద్ద రేంజికి వెళ్లిన కథానాయకుడు విక్రమ్. ఆయన స్థాయి ప్రకారం చూస్తే కొడుకు అరంగేట్రం అదిరిపోవాలి. కానీ ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేయడం కోసం కథను ఎంచుకునే విషయంలో విక్రమ్ చేసిన ఘోరమైన తప్పిదం.. కొడుకు కెరీర్‌కు దారుణంగా దెబ్బ తీసేలా ఉంది. తెలుగులో కల్ట్ మూవీ అనిపించుకున్న 'అర్జున్ రెడ్డి'ని రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అని.. ఇప్పుడు కాదు ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినపుడే చాలామంది అభిప్రాయపడ్డారు. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండది లాండ్ మార్క్ పెర్ఫామెన్స్. దశాబ్దాల అనుభవం ఉన్న హీరోలు కూడా ఇలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వలేరు. విజయ్ సైతం ఇలాంటి పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేయలేకపోవచ్చు. అలాంటి పాత్రను కొత్తవాడైన ధ్రువ్‌ కోసం ఎంచుకోవడం తప్పు కాక మరేంటి?

హిందీలో ఎంతో అనుభవం ఉన్న, మంచి పెర్ఫామర్ అయిన షాహిద్ కపూర్ సైతం.. విజయ్‌తో పోలిస్తే కొంచెం దిగువనే ఉన్నాడు. అలాంటిది ధ్రువ్‌తో ఈ పాత్ర చేయించడమేంటి? అది చాలదన్నట్లు ఈ రీమేక్ మూవీ కోసం బాలా లాంటి ఒరిజినాలిటీ ఉన్న దర్శకుడిని ఎంచుకోవడం మరో పెద్ద తప్పిదం. ఆయన తన పైత్యాన్నంతా జోడించి రీమేక్‌ను చెడగొట్టేశాడు. టీజర్, ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. సినిమా పట్ల విపరీతమైన నెగెటివిటీ ముసురుకుంది. బాలా తీసిన సినిమాను చెత్త బుట్టలో వేయాలనే డేరింగ్ డెషిసన్ తీసుకోవడం అభినందనీయమే. కానీ అసలీ సినిమాను రీమేక్ చేయడమే తప్పు, ధ్రువ్ దానికి సెట్ కాడు అనే ప్రేక్షకుల ఆలోచనను మాత్రం మార్చలేకపోయారు.

ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య.. ఒరిజినల్‌ను డిట్టో ఫాలో అయిపోతూ తన వెర్షన్ ఏదో తీశాడు. అది చూసినా కూడా సినిమా పట్ల పాజిటివిటీ ఏమీ రాలేదు. మళ్లీ సోషల్ మీడియాలో అదే నెగెటివిటీ కనిపిస్తోంది. బాలా వెర్షన్ బాలేదనుకున్నపుడు మొత్తంగా ఈ సినిమానే పక్కన పెట్టేయాల్సింది. కానీ మళ్లీ అనవసరంగా కష్టపడ్డారు. ఇప్పుడు చూస్తే రెండో వెర్షన్‌ పట్ల కూడా జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు. ఎంతో అనుభవం ఉన్న విక్రమ్ అసలు తన కొడుకు కోసం ఈ సినిమాను ఓకే చేయడమే పెద్ద తప్పంటూ చివరికి అందరూ అతడినే నిందిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English