వినాయక్ కాన్ఫిడెన్సుకి మెచ్చుకోవాల్సిందే

వినాయక్ కాన్ఫిడెన్సుకి మెచ్చుకోవాల్సిందే

‘ఇంటిలిజెంట్’ సినిమా చూశాక దర్శకుడిగా వి.వి.వినాయక్ ‌ పని అయిపోయిందనే నిర్ణయానికి వచ్చేశారందరూ. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు వినాయక్. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. దీంతో వినాయక్ కూడా దర్శకుడిగా తన కెరీర్ మీద ఆశలు వదిలేసుకున్నట్లున్నాడు. ఆశ్చర్యకరంగా ఒక సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అయిపోయాడు.

గతంలో ‘ఠాగూర్’ సినిమాలో చిన్న పాత్ర చేశాడు కానీ.. వినాయక్‌ హీరోగా నటించడం అన్నది ఊహకందని విషయం. అసలు వినాయక్ అవతారం చూస్తే ఆయన హీరోగా నటించడం ఏంటి అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. కానీ దిల్ రాజు లాంటి నిర్మాత వినాయక్ హీరోగా సినిమా తీయడానికి రెడీ అయ్యాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత లేకుండా పోదు.

ఇంతకుముందు ‘శరభ’ అనే సినిమా తీసిన నరసింహారావు రూపొందిస్తున్న ఈ చిత్రంలో వినాయక్‌ తన వయసుకు, లుక్‌కు తగ్గ పాత్రే చేస్తున్నాడట. తాజాగా బాలయ్య కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న వినాయక్‌ మునుపటి కంటే మరింత లావుగా కనిపించాడు. సినిమాకు అవసరమైన లుక్ అదేనట. తాను ఒరిజినల్‌గా ఎలా ఉన్నానో అలాగే సినిమాలోని ముఖ్యమైన పోర్షన్లో వినాయక్ కనిపిస్తాడట. ముందుగా ఆ పోర్షనే చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ అయ్యాక తర్వాతి షెడ్యూల్‌కు కొన్ని నెలల విరామం ఇస్తారట.

ఆ సమయంలో వినాయక్ బరువు తగ్గి సన్నగా తయారు కావాల్సి ఉంటుంది. అప్పుడాయన ‘హీరో’ అవతారంలోకి మారుతాడేమో. ఏదేమైనప్పటికీ రెగ్యులర్ హీరోల తరహాలో సినిమా కోసం ఇంతగా కష్టపడటానికి వినాయక్ రెడీ కావడం ఆశ్చర్యకరమే. ఇలాంటి సినిమా చేయడానికి అంగీరించడంలో వినాయక్ చూపించిన కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English