ఆర్ఆర్ఆర్ రిలీజ్.. జక్కన్న ఆ రోజే చెప్పాడు

ఆర్ఆర్ఆర్ రిలీజ్.. జక్కన్న ఆ రోజే చెప్పాడు

తన సినిమాల మేకింగ్ విషయంలో రాజమౌళి ప్లానింగ్ చాలా గొప్పగా ఉంటుందని అంటారు. భారీ చిత్రాలు తీసేటపుడు నటీనటులకు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ పెట్టడం.. వర్క్ షాప్‌‌లు నిర్వహించడం లాంటివి చేసి కానీ.. షూటింగ్‌కి వెళ్లడు. టెక్నీషియన్లతోనూ ఆయనకు గొప్ప సమన్వయమే ఉంది. ప్రి ప్రొడక్షన్ కోసం చాలా సమయం కేటాయిస్తాడు. సన్నివేశాల చిత్రీకరణలోనూ జక్కన్న చాలా స్పష్టతతో ఉంటాడని అంటారు.

మరి ఇంత ప్లానింగ్‌తో వెళ్లినా రాజమౌళి సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావు. మేకింగ్ టైంలో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం వల్ల కావచ్చు.. విజన్ ఎప్పటికప్పుడు మారిపోయి భారీతనం మరింత పెంచాలని చూడటం వల్ల కావచ్చు.. జక్కన్న చేతుల్లో లేని ఇతర విషయాల వల్ల కావచ్చు ఆయన సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. రిలీజ్ డేట్ డెడ్ లైన్ తప్పుతుంటాయి.

‘ఈగ’తో పాటు ‘బాహుబలి’ రెండు భాగాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’కు మాత్రం ఇలా జరగకూడదని చాలా పట్టుదలతో ఉన్నాడు జక్కన్న. విడుదలకు దాదాపు ఏడాదిన్నర రిలీజ్ డేట్ ఇచ్చి కచ్చితంగా ఆ డేట్ అందుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలసిందే. ఐతే ఈ డేట్ విషయంలో విలేకరులు నొక్కి నొక్కి అడిగితే మాత్రం.. ఒకవేళ డేట్ మారొచ్చేమో కానీ.. సంవత్సరం మాత్రం మారదని తేల్చి చెప్పాడు జక్కన్న. ఇక్కడే ఆయన ఒక అడ్వాంటేజ్ తీసుకునేశాడు. ఏవైనా కారణాలతో జులై 30వ తేదీని మిస్ అయితే కావచ్చొన్న సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అదే జరిగేలా ఉంది. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడి షూటింగ్‌‌కు దూరం కావడంతో షెడ్యూళ్లు తేడా కొట్టేశాయి.

ఒకరు షూటింగ్‌కి దూరమై.. ఇంకొకరు అందుబాటులో ఉన్నా.. కాంబినేషన్ సీన్లు పక్కన పెట్టి వేరే సీన్లు ముందు లాగించేవాళ్లు. కానీ ఇద్దరూ గాయపడి తలో నెల రోజులు షూటింగుకి దూరం కావడంతో జక్కన్న ప్లానింగ్ అంతా దెబ్బ తినేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న ప్రకారం షూటింగ్ అవగొట్టి వచ్చే ఏడాది జులై 30కి రావడం దాదాపు అసాధ్యం అంటున్నారు. తొందరపడితే ఔట్ పుట్ దెబ్బ తింటుంది కాబట్టి.. పర్ఫెక్షన్ కోసం తపించే జక్కన్న సినిమాను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English