ఇది తేడా కొడితే జీరో అయిపోతాడు

ఇది తేడా కొడితే జీరో అయిపోతాడు

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి ఎక్కడలేని పాపులారిటీ సంపాదించేశాడు కార్తికేయ. ఐతే ఆ సక్సెస్‌లో హీరో పాత్ర చాలా పరిమితం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కార్తికేయ మాటలు చూస్తే అతను నేల విడిచి సాము చేయట్లేదనే అనిపించింది. కానీ తమిళ దర్శకుడు కృష్ఱ, అగ్ర నిర్మాత కలైపులి థాను అతడిని వెతుక్కుంటూ వచ్చి సినిమా చేసేసరికి తన గురించి తాను ఏదో ఊహించుకునేశాడు.

తలా తోకా లేని ‘హిప్పి’ సినిమా చేశాడు. ఆ సినిమాలో అతడి యాక్ట్స్ చూస్తే పూర్తిగా దారి తప్పినట్లే కనిపించాడు. కార్తికేయకు ఎక్కిన మత్తంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత దిగిపోయింది. ఈ చిత్రానికి హైప్ పెంచడానికి ఏదేదో చేశారు కానీ.. ఏమీ పని చేయలేదు. సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. టాక్ దారుణంగా రావడంతో సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.

కార్తికేయ ఆకాశం నుంచి నేలమీదికి వచ్చేశాడు. ఇప్పుడిక అతను నేలమీదైనా ఉంటాడా.. లేక పాతాళానికి పడిపోతాడా అన్నది ‘గుణ 369’ సినిమాతో తేలనుంది. ఈ చిత్ర టీజర్ సోమవారం ఉదయం విడుదల కానుంది. ‘హిప్పి’లో పూర్తిగా రొమాంటిక్ టచ్ ఉన్న పాత్ర చేసిన కార్తికేయ ఈసారి మాస్ పాత్ర చేస్తున్నట్లున్నాడు. కొంచెం లుక్ మార్చుకుని చేతిలో కత్తి పట్టి భిన్నంగా కనిపిస్తున్నాడు ఈ సినిమా పోస్టర్లలో. ఇది యాక్షన్ లవ్ స్టోరీ అంటున్నారు. అర్జున్ జంధ్యాల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన అనఘ అనే మలయాళ అమ్మాయి నటిస్తోంది.

ఈ టీజర్ చూశాక కార్తికేయ కెరీర్ మీద ఒక అంచనాకు వచ్చేస్తారేమో జనాలు. టీజర్ ఆసక్తికరంగా లేకపోతే ఈ చిత్రానికి కూడా బజ్ రావడం కష్టం. సినిమా కూడా తేడా కొట్టిందంటే ఇక అతను సినిమాలు మానేసుకోవాల్సిందేనేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English