17 ఏళ్ల తర్వాత ఆ జంట మళ్లీ ఇలా..

 17 ఏళ్ల తర్వాత ఆ జంట మళ్లీ ఇలా..

ఒక సినిమాలో మురిపించిన జంట 17 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి నటిస్తే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. మాధవన్, సిమ్రాన్ ఇలాగే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘పరవశం’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ జంటగా ఆకట్టుకున్నారు కానీ.. ఆ సినిమా ఆడలేదు.

ఐతే తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘అమృత’ చిత్రం ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. మణిరత్నం, సిమ్రాన్ గొప్ప నటనతో ఆకట్టుకున్నారు. ఈ జోడీ మళ్లీ ఎప్పుడూ కలిసి నటించలేదు. సిమ్రాన్ హీరోయిన్‌గా రిటైరైపోయి వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోవడంతోో ఈ జోడీని మళ్లీ చూస్తారని కూడా ఎవరూ అనుకోలేదు.

ఐతే కొన్నేళ్ల కిందటే రీఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్.. వరుసగా సీనియర్ హీరోలతో కలిసి నటిస్తోంది. ‘పేట’లో రజనీకాంత్‌‌కు జోడీగా కనిపించిన ఆమె.. తాజాగా మాధవన్‌తో జోడీ కట్టింది. శాస్త్రవేత్త నంబి నారాయణన్ కథతో మాధవన్ చేస్తున్న ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో అతడికి జోడీగా సిమ్రాన్ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో మాధవన్ హీరోనే కాదు.. దర్శకుడు కూడా.

నంబి నారాయణన్ పాత్ర కోసం ఇన్నాళ్లూ జుట్టు, గడ్డం పెంచి విచిత్రమైన అవతారంలో కనిపించిన మాధవన్.. ఈ మధ్యే అవన్నీ తీసేసి తన పాత అవతారంలోకి వచ్చాడు. సినిమాలో యంగ్ నంబి నారాయణన్ పాత్ర కోసం అతను లుక్ మార్చాడు. ఇందులో అతడి భార్యగా సిమ్రాన్ కనిపిస్తోంది. 17 ఏళ్ల కిందట ‘అమృత’లో కనిపించినప్పటితో పోలిస్తే మాధవన్‌లో పెద్దగా మార్పు లేదు. సిమ్రానే కొంచెం తేడాగా ఉంది. అయినా ఈ వయసులో ఒక హీరోయిన్ ఆ మాత్రం లుక్ మెయింటైన్ చేయడం కూడా గొప్ప విషయమే. ఈ జోడీ మళ్లీ ఇలా కనిపించడం వారి అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English