‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కొత్త వెర్షన్ టీజరొచ్చింది

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కొత్త వెర్షన్ టీజరొచ్చింది

తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో ధ్రువ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేయడం.. బాలా తీసిన ఆ సినిమా ఔట్ పుట్ చూసి బెంబేలెత్తిన నిర్మాతలు దాన్ని తీసి చెత్తబుట్టలో పడేసి.. ‘అర్జున్ రెడ్డి’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో కొత్తగా మళ్లీ సినిమా మొదలుపెట్టడం తెలిసిన సంగతే. పెద్దగా సమయం తీసుకోకుండా సెకండ్ వెర్షన్‌ను వేగంగా పూర్తి చేసిన చిత్ర బృందం.. టీజర్ కూడా రెడీ చేసేసింది.

‘ఆదిత్య వర్మ’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈ రోజే రిలీజైంది. బాలా లాగా సొంత టచ్ ఏమీ చూపించకుండా గిరీశయ్య దాదాపుగా ఒరిజినల్‌ను ఫాలో అయిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’కి జిరాక్స్ కాపీలా కనిపిస్తోంది కొత్త టీజర్ చూస్తే. ఐతే బాలా తీసిన ‘వర్మ’తో పోలిస్తే ‘ఆదిత్య వర్మ’ బెటర్‌గానే అనిపిస్తోంది కానీ.. ఒరిజినల్లోని ఇంటెన్సిటీని ఇది కూడా పూర్తి స్థాయిలో క్యారీ చేయలేదు.

ప్రధానంగా ధ్రువ్ విక్రమే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో మిస్ ఫిట్ అనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండను మ్యాచ్ చేయడం ఎవరికీ అంత సులువు కాదన్న విషయం మరోసారి రుజువైంది. హిందీలో సందీప్ రెడ్డి వంగనే డైరెక్ట్ చేయడం, షాహిద్ కపూర్ లాంటి మంచి పెర్ఫామర్ ఈ పాత్ర చేయడం వల్ల ఇంటెన్సిటీ క్యారీ అయింది కానీ.. తమిళంలో మాత్రం ఆ మ్యాజిక్‌ రీక్రియేట్ చేయడం కష్టమే అని తాజా టీజర్ చూశాక స్పష్టమైంది.

ధ్రువ్ కొన్ని సీన్లలో ఓకే అనిపించాడు కానీ.. కొన్నిచోట్ల పాత్రకు తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్, అగ్రెషన్ అతన చూపించలేకపోయాడు. ‘వర్మ’తో పోలిస్తే ‘ఆదిత్యవర్మ’లో అతడి డైలాగ్ డెలివరీ మారింది. కొంచెం తీవ్రత పెంచాడు. ఈసారి సినిమా కోసం ఎంచుకున్న హీరోయిన్ బాగుంది. ముందున్న అమ్మాయిలా భయపెట్టనైతే భయపెట్టలేదు. మొత్తానికి ముందు వెర్షన్‌తో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంది కానీ.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ‘ఆదిత్య వర్మ’ అయినా అనుకున్న ఫలితం రాబడుతుందా అన్నది సందేహంగానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English