టాలీవుడ్ హీరోలకు ఇంత బ్యాడ్ టైమేంటో?

టాలీవుడ్ హీరోలకు ఇంత బ్యాడ్ టైమేంటో?

టాలీవుడ్ హీరోలకు పెద్ద శాపమేదో తగిలినట్లుంది. లేకుంటే రెండు నెలల వ్యవధిలో అరడజను మంది హీరోలు ప్రమాదాలకు గురై గాయాల పాలు కావడమేంటో అర్థం కావడం లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు స్వల్ప వ్యవధిలో గాయపడ్డ సంగతి తెలిసిందే.

చరణ్ కాలికి గాయమైతే.. ఎన్టీఆర్ చేతిని గాయపరుచుకున్నాడు. దీంతో ఈ సినిమా షెడ్యూళ్లన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే వాళ్లిద్దరూ కోలుకుని మళ్లీ షూటింగ్ మొదలుపెడుతున్నారు. ఇక కొన్ని రోజుల కిందటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. కారు దెబ్బ తిన్న తీరు ఆందోళన రేకెత్తించేలా ఉంది. ఐతే వరుణ్‌తో పాటు కార్లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

తాజాగా మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు టాలీవుడ్ హీరోలు గాయపడ్డారు. ఆ ముగ్గురూ కొంచెం తీవ్రంగానే గాయపడ్డట్లు తెలుస్తోంది. తన కొత్త సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను డూప్ లేకుండా తనే చేస్తుండగా నాగశౌర్య మోకాలిని గాయపరుచుకున్నాడు. అతడికి నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమయ్యే పరిస్థిితి తలెత్తింది.
మరోవైపు సందీప్ కిషన్ తన కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా బ్లాస్ట్ సీన్ చేస్తుంటే ప్రమాదానికి గురైనట్లు నిన్న రాత్రే సమాచారం బయటికి వచ్చింది. ఇంతలో మరో యువ కథానాయకుడు శర్వానంద్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడైంది. `96` షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో కొన్ని రోజులుగా స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో శ‌ర్వా రెండు రోజులు సాధన చేసిన శర్వా.. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సరిగానే ల్యాండ్ అయ్యాడట. ఐదో ప్రయత్నంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ తేడా అయి శర్వా భుజానికి తీవ్ర గాయం కాగా.. కాలు కూడా స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయ్యిందట. దీంతో శర్వా హైదరాబాద్‌కు వచ్చేశాడు. సోమ‌వారం శర్వా భుజానికి శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English