పక్కన హీరోయిన్ని పెట్టుకుని ఆమెనే తిట్టారట

పక్కన హీరోయిన్ని పెట్టుకుని ఆమెనే తిట్టారట

థియేటర్లో ఇద్దరు స్నేహితులు కూర్చుని ఉన్నారు. వాళ్లిద్దరూ సినిమా చూస్తూ అందులో నటీనటులు గురించి.. సన్నివేశాల గురించి రకరకాల కామెంట్లు చేసుకుంటూ సాగిపోతున్నారు. మధ్యలో హీరోయిన్ ప్రస్తావన వచ్చింది. ఆమె లుక్స్.. పెర్ఫామెన్స్ వాళ్లకు నచ్చినట్లు లేదు. కామెడీగా మాట్లాడారు. నోటికొచ్చిన కామెంట్ చేశారు. ఐతే చివరికి సినిమా పూర్తయింది. లైట్లు ఆన్ చేశారు. వాళ్ల పక్కనే ఆ సినిమా హీరోయిన్ ఉంది. వాళ్లు తిట్టుకున్న అమ్మాయే పక్కన ఉండటం చూసి ఆ ఇద్దరూ షాకయ్యారు. బాలీవుడ్ భామ తారా సుతారియాకు ఎదురైన అనుభవమిది. దీని గురించి ఆమె ఓపెన్‌గా చెప్పేయడం ఇక్కడ విశేషం. మోడలింగ్‌తో పేరు సంపాదించి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తార.. అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

తారాతో పాటు టైగర్‌ ష్రాఫ్‌, అనన్యా పాండే ప్రధాన తారాగణంగా నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’కు పునీత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 10న విడుదలై ఓ మోస్తరు టాక్ అందుకుంది. వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఐతే తాను ఈ సినిమా చూస్తుండగా ఎదురైన చిత్రమైనర అనుభవం గురించి తార తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘థియేటర్‌లో ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుని ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమా చూశా. పక్కన ఉన్నది నేనని వారికి తెలియదు. సినిమాలోని ఓ సన్నివేశం చూసిన తర్వాత నా గురించి చాలా చెడ్డగా మాట్లాడారు. వారి పక్కనే నేనున్న సంగతి వాళ్లకు తెలియదు. చివరికి సినిమా పూర్తయిన తర్వాత లైట్స్‌ ఆన్‌ చేశారు. నేను ఆ ఇద్దరమ్మాయిలవైపు చూశా.. వారు నన్ను చూసి షాక్‌ అయ్యారు. నేను నవ్వి, పక్కకు వచ్చేశా’ అని తార చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English