ఎవరీ సుజీత్.. బాలీవుడ్డోళ్ల ఆరా

ఎవరీ సుజీత్.. బాలీవుడ్డోళ్ల ఆరా

ఒక తెలుగు సినిమా ఒకేసారి హిందీలో కూడా రిలీజై.. అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అరుదైన విషయం. తొలిసారిగా ‘బాహుబలి’ విషయంలో మాత్రమే ఇలా జరిగింది. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి అనేవాడి పేరు హిందీలో పాపులర్. ‘మగధీర’ సినిమాతో తొలిసారి అక్కడి ఫిలిం మేకర్స్, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడాయన.

ఈ సినిమా హిందీలో విడుదల కాకపోయినా.. బాలీవుడ్లో కొంత చర్చకు తావిచ్చింది. దీని తర్వాత ‘ఈగ’ డబ్బింగ్ వెర్షన్‌తో రాజమౌళి సత్తా ఏంటో బాలీవుడ్ జనాలకు బాగా తెలిసింది. ఈ బేస్‌తోనే రాజమౌళి పేరే ముందు పెట్టి ‘బాహుబలి’ని హిందీలో ప్రమోట్ చేశారు. భలేగా హైప్ తీసుకొచ్చారు. ఇక ఆ సినిమా సాధించిన విజయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభాస్ నటించిన ‘సాహో’కు కూడా ‘బాహుబలి’ దీటుగా హైప్ వస్తోంది. ఇందులో ప్రభాస్ పాత్ర కీలకమనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడమే దీనికి హైప్ రావడానికి కారణం.

ఐతే మొన్న రిలీజైన ‘సాహో’ టీజర్ చూశాక బాలీవుడ్ జనాల దిమ్మదిరిగింది. రాజమౌళి ట్రాక్ రికార్డు చూసి ‘బాహుబలి’ ఆ స్థాయిలో ఉండటంలో ఎవరికీ అంత ఆశ్చర్యం కలగలేదు. కానీ ‘సాహో’ను రూపొందిస్తున్నది సుజీత్ అనే 28 ఏళ్ల కుర్రాడు. అతడి అనుభవం ఒక్క సినిమా (రన్ రాజా రన్) మాత్రమే. అది కూడా చిన్న స్థాయి సినిమానే. ఇంత చిన్న వయసులో పెద్ద అనుభవం లేని ఒక దర్శకుడు ఇంత పెద్ద సినిమాను డీల్ చేయడం బాలీవుడ్ వాళ్లకు మింగుడు పడటం లేదు.

‘సాహో’ మేకింగ్‌లో హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి, అక్కడి నిపుణుల పనితనం ఉన్నప్పటికీ.. ప్రపంచ స్థాయి ఔట్ పుట్, ఫీల్ తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ‘సాహో’లో విజువల్స్, యాక్షన్ పార్ట్, పంచ్‌లు చూసి బాలీవుడ్ వాళ్లందరూ కూడా ‘వావ్’ అనే అన్నారు. ఇప్పటిదాకా సుజీత్ పేరు విని ఉండకపోవడంతో ఎవరితను అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారట బాలీవుడ్ వాళ్లు. ఏమో.. ‘సాహో’ తర్వాత సుజీత్ ‌హిందీ సినిమా తీసినా ఆశ్చర్యం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English