మళ్లీ సంక్రాంతి అంటే కష్టం బాలయ్యా

మళ్లీ సంక్రాంతి అంటే కష్టం బాలయ్యా

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి పండుగతో ఉన్న అనుబంధం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ పండక్కి వచ్చిన ఆయన సినిమాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. చివరగా ‘జై సింహా’తో హిట్ కొట్టాడు. ఐతే ఈ ఏడాది మాత్రం సంక్రాంతికి బాలయ్య చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ఆ పండక్కే వచ్చి దారుణంగా బోల్తా కొట్టింది. అయినా పట్టించుకోకుండాా వచ్చే సంక్రాంతికి తన కొత్త సినిమాను రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నాడు బాలయ్య. ‘జై సింహా’ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య ఇటీవలే ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని చకచకా ముగించి సంక్రాంతి రేసులో నిలబెట్టాలని బాలయ్య భావిస్తున్నాడు. కానీ అది చాలా రిస్క్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాబోయే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’తో పాటు అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ిసినమా కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటితో బాలయ్య చిత్రం ఢీకొంటే నెట్టుకు రావడం ఈజీ కాదు. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ పెద్ద డిజాస్టర్ కావడం.. మిగతా రెండు సినిమాలు కూడా తేలిపోవడంతో ‘జై సింహా’ ఏదో అలా ఆడేసింది. మామూలుగా చూస్తే అది సాధారణమైన సినిమా. ఫ్లాప్ కావాల్సింది. కాలం కలిసొచ్చి ఓ మోస్తరుగా ఆడేసింది. కానీ మహేష్, బన్నీల సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అవి మరీ తీసికట్టుగా అయితే ఉండే అవకాశం లేదు. మళ్లీ రత్నం కథ, కె.ఎస్ డైరెక్షన్ అనగానే బాలయ్య చిత్రంలో ఏమంత విశేషం ఉండకపోవచ్చనిపిస్తోంది. మళ్లీ రొటీన్ సినిమా ఏదో అందిస్తారు. ఇలాంటి చిత్రం మహేష్, బన్నీల సినిమాలతో పోటీ పడితే నిలబడటం కష్టమే. సంక్రాంతి సెంటిమెంటును ఎలాగూ ‘యన్.టి.ఆర్’ దెబ్బ తీసింది కాబట్టి సీజన్ ఏదైనా చూసుుకుంటే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English