సాహో ఒక్కడా లేక ఇద్దరా?

సాహో ఒక్కడా లేక ఇద్దరా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' టీజర్ నిన్ననే రిలీజైంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, యాక్షన్ షాట్లతో ప్రేక్షకుల కళ్లు చెదిరిపోయేలా చేసిందా టీజర్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమా మీద నెలకొన్న అంచనాల్ని ఈ టీజర్ బాగానే అందుకుంది. 'బాహుబలి'కి పూర్తి భిన్నమైన అవతారంలో.. మోడర్న్ లుక్‌తో ప్రభాస్ ఆకట్టుకున్నాడు.

ఐతే ఈ టీజర్ గమనిస్తే.. ప్రభాస్ లుక్స్‌లో వైవిధ్యం గమనించవచ్చు. హీరోయిన్ని కౌగిలించుకుని నేనున్నా అనే సీన్లో.. గన్ తీసి కాల్చే మరో సీన్లో అతడి హేర్ స్టైల్.. మిగతా లుక్ ఒక రకంగా ఉంటాయి. జుట్టు నున్నగా, ఒక పద్ధతిగా దువ్వి ఉంటుంది. గడ్డం అది కూడా భిన్నంగా ఉంటుంది. మిగతా సీన్లన్నింటిలో ప్రభాస్ మరో లుక్‌లో కనిపించాడు. హేర్ స్టైల్, గడ్డం కొంచెం ట్రెండీగా.. పోష్‌గా కనిపిస్తుంది.

దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం అయినా చేస్తుండాలి.. లేదంటే ఆ పాత్రలో షేడ్స్ అయినా ఉండాలి. ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించిన రెండు సందర్భాల్లాలోనూ అతడి పక్కన హీరోయిన్ ఉంది. అలాంటపుడు ఇది వేర్వేరు కాలాల్లో జరిగే కథ కాకపోవచ్చు. ఒకటి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ లాగా కూడా కనిపించడం లేదు. మరి 'బిల్లా'లో మాదిరి ప్రభాస్ పాత్రకు సంబంధించి ట్విస్టులేమైనా ఉన్నాయో ఏమో తెలియదు మరి. ఈ యాక్షన్ థ్రిల్లర్లో కచ్చితంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉండే ఉంటాయి.

ప్రభాస్ పాత్ర విషయంలోనూ అలాంటి ట్విస్టు ఏదో ఒకటి ఉండొచ్చు. దర్శకుడు సుజీత్ తొలి సినిమా 'రన్ రాజా రన్'లో ట్విస్టులకు లోటే ఉండదు. హీరో పాత్రను చాలా కొత్తగా, షాకింగ్‌గా ప్రెజెంట్ చేశాడతను. 'సాహో' రేంజ్ ప్రకారం చూస్తే ఇంకా ట్విస్టులు ఆశించవచ్చు. వచ్చే నెలలో రిలీజ్ చేయబోయే ట్రైలర్లో ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English