ఈయనతో ఆఫీసర్ సినిమా తీశాం!

ఈయనతో ఆఫీసర్ సినిమా తీశాం!

మూడేళ్ల ముందు 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఊపిరి' లాంటి వరుస హిట్లతో మాంచి ఊపు మీద కనిపించాడు అక్కినేని నాగార్జున. ముఖ్యంగా నాగ్ కెరీర్ తిరోగమనంలో నడుస్తున్న దశలో 'సోగ్గాడే చిన్నినాయనా' లాంటి బ్లాక్ బస్టర్ అందుకుని రూ.50 కోట్ల షేర్ సాధించడం ఎవ్వరూ ఊహించనిది. కానీ ఈ సక్సెస్ స్ట్రీక్‌ను నాగ్ కొనసాగించలేకపోయాడు.

వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. ఆయన కెరీర్లో అతి పెద్ద పతనం అంటే 'ఆఫీసర్' సినిమానే. వచ్చిన వసూళ్లు థియేటర్ల రెంట్లకు కూడా సరిపోలేదంటే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అర్థంచేసుకోచ్చు. తనకు 'శివ' లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చాడన్న కృతజ్ఞతతో వర్మతో నాగ్ సినిమా చేసి అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ చిత్రాన్ని ముంబయికి చెందిన తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర నిర్మించాడు. ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం వృథానే అయింది.

ఆ తర్వాత ఈ సుధీర్ చంద్ర అడ్రస్ లేడు. ఆశ్చర్యకరంగా అతను నాగ్ కొత్త సినిమా 'మన్మథుడు-2' టీజర్ గురించి స్పందించాడు. టీజర్ చివర్లో నాగ్.. ''ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్'' అని డైలాగ్ చెప్పే లుక్ షేర్ చేస్తూ.. 'ఈయనతో ఆఫీసర్ సినిమా తీశాం' అనే కామెంట్ పెట్టాడు సుధీర్. సినిమా తీసినపుడు.. రిలీజ్ చేసినపుడు ఆహా ఓహో అనే అంటారు. సుధీర్ చంద్ర కూడా 'ఆఫీసర్' గురించి అలాగే ప్రమోట్ చేశాడు. రిలీజ్ టైంలో పాజిటివ్ రివ్యూలన్నీ తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు.

కానీ కొంత కాలానికి వాస్తవం బోధపడింది. తాను నిర్మించిన 'ఆఫీసర్' ఎంత పెద్ద డిజాస్టరో అర్థమైంది. ఇప్పుడు ఆసక్తికరంగా సాగిన 'మన్మథుడు-2' టీజర్, అందులో నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి.. అలాంటి హీరోతో 'ఆఫీసర్' లాంటి చెత్త సినిమా తీశామని రిగ్రెట్ అవుతూ ట్వీట్ పెట్టినట్లున్నాడు సుధీర్ చంద్ర. మరి నిర్మాత సంగతిలా ఉంటే.. ఆ సినిమా తీసిన వర్మ స్పందనేంటో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English