రకుల్ ఫ్యాన్స్ హర్టయ్యారా.. ఆగండాగండి

రకుల్ ఫ్యాన్స్ హర్టయ్యారా.. ఆగండాగండి

నిన్న రిలీజ్ చేసిన ‘మన్మథుడు-2’ టీజర్లో మొత్తం నాగార్జున మీదే ఫోకస్ చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నాగార్జున క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఉద్దేశంగా ఆ టీజర్ సాగింది. అది చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకుల్లో బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నాగ్‌తో పాటుగా వెన్నెల కిషోర్, దేవదర్శిని, లక్ష్మి, రావు రమేష్ లాంటి కీలకమైన పాత్రల్ని పరిచయం చేశారు. కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు మాత్రం టీజర్లో చోటివ్వలేదు.

ఈ చిత్రంలో అతిథి పాత్రలు చేస్తున్న సమంత, కీర్తి సురేష్‌లకు కూడా టీజర్లో చోటు దక్కలేదు. ఐతే సమంత, కీర్తి లేకపోయినా పర్వాలేదు కానీ.. లీడ్ హీరోయిన్ అయిన రకుల్‌ను టీజర్లో చూపించకపోవడం మాత్రం అన్యాయంగానే కనిపించింది. దీనిపై రకుల్ ఫ్యాన్స్ హర్టయ్యారు.

మామూలుగా రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్లో మహిళల హక్కుల కోసం గళం విప్పుతుంటాడు. తన భార్య చిన్మయితో కలిసి మహిళల కోసం పోరాడుతుంటాడు. బయట అలా చేసేవాడు సినిమా విషయంలో హీరోయిన్‌‌కు అన్యాయం చేశాడేంటి.. మిగతా కమర్షియల్ డైరెక్టర్ల లాగే హీరోయిన్ని తక్కువగా చూశాడేంటి అంటూ అతడిని ఆటాడేసుకున్నారు నెటిజన్లు. ఐతే ఇదంతా గమనించిన రాహుల్ వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే టీజర్లో రకుల్‌ను చూపించలేదన్నాడు. మూడు వారాల తర్వాాత రకుల్ పాత్రనే బేస్ చేసుకుని స్పెషల్ టీజర్ వదలబోతున్నట్లు అతను వెల్లడించాడు. ఆ ఉద్దేశంతోనే టీజర్లో ఆమెకు చోటివ్వలేదన్నాడు. దీంతో నెటిజన్లు శాంతించారు.

మరి ఇది ముందే నిర్ణయమైందా.. జనాల స్పందన చూసి రాహుల్ ఇలా నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియదు. టీజర్ చూస్తే సినిమాలో నాగ్‌ది ప్లేబాయ్ పాత్రలా అనిపిస్తోంది. కానీ తనతో పోలిస్తే సగం కన్నా తక్కువ వయసున్న రకుల్‌తోనూ నాగ్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English