రికార్డుల్ని పీకి అవతల పడేస్తున్నాడు

రికార్డుల్ని పీకి అవతల పడేస్తున్నాడు

అనుకున్నదే అవుతోంది. ‘సాహో’ టీజర్ ప్రభంజనం సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో టీజర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండే హిందీ సినిమాల రికార్డుల్ని అలవోకగా దాటేసింది ‘సాహో’. కేవలం 12 గంటల్లో 40 కోట్ల వ్యూస్ తెచ్చుకుంది ‘సాహో’ టీజర్. ఇప్పటిదాకా ఏ టీజర్ సాధించని రికార్డు ఇది. అంతకుముందే ఆరు గంటల్లో 25 మిలియన్ (2.5 కోట్లు) వ్యూస్‌తో రికార్డు నెలకొల్పింది ‘సాహో’. ఏ ఇండియన్ సినిమా టీజర్ కూడా ఇంత వేగంగా అన్ని వ్యూస్ అందుకున్నది లేదు.

12 గంటల్లోనే మిలియన్ లైక్స్ కూడా సాధించిన ‘సాహో’ టీజర్.. ఇండియాలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. నిన్న ‘సాహో’ టీజర్ లాంచ్ అయినప్పటి నుంచి అదే యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఒకటికి నాలుగు భాషల్లో రిలీజవడంతో ‘సాహో’ టీజర్ ప్రభంజనానికి అడ్డే లేకుండా పోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ టీజర్ సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల్లో 6 కోట్ల వ్యూస్ పూర్తి చేసుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. అందులో హిందీ టీజర్ మాత్రమే 20 మిలియన్ మార్కును అందుకునేలా ఉంది. తెలుగు టీజర్ కూడా 10 మిలియన్ మార్కును దాటేసి దూసుకెళ్తోంది.

‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోని రీతిలో ‘సాహో’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘బాహుబలి’కి టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ వదిలారు. దాని రికార్డుల్ని ‘సాహో’ బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ మరింతగా జనాలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ‘సాహో’ ఇలా ప్రభంజనం సాగిస్తోంది. రేప్పొద్దున ట్రైలర్ లాంచ్ అయితే ఇంకెలాంటి రికార్డులు నమోదవుతాయో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English