వాళ్ల కోసం ప్రభాస్ విప్పాల్సిందే

వాళ్ల కోసం ప్రభాస్ విప్పాల్సిందే

మన తెలుగు వర్షన్ ట్రైలర్ పక్కన పెట్టేస్తే, బాలీవుడ్లో టీ-సిరీస్ రిలీజ్ చేసిన హిందీ వర్షన్ ట్రైలర్ కు మాత్రం విపరీతమైన స్పందన వచ్చేసింది. పైగా హిందీ సినిమా లవ్వర్స్ ఆ యుట్యూబ్ వీడియోపై చేస్తున్న కామెంట్లు చూస్తుంటే, వామ్మో ప్రభాస్ కు ఇంత క్రేజుందా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంతటి ప్రేమను కురిపించేస్తున్నారు.

కొంతమంది అయితే ఏకంగా బాలీవుడ్లో అయితే ప్రభాస్ లేదంటే టైగర్ ష్రాఫ్‌ తప్పించి మరే ఇతర హీరో కూడా ఆ తరహాలో కండలు, స్వాగ్ అలాగే యాక్షన్ స్టంట్లు చేసే గట్స్ కలిగియుండరని కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్స్.. రేస్ 3 వంటివి చాలామటుకు ఫ్లాప్ కావడంతో, ఇప్పుడు ప్రభాస్ వాళ్ళందరికీ బాప్ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. కొందరు మాత్రం ప్రభాస్ మరోసారి షర్టు విప్పేసి తన సిక్స్ ప్యాక్ ను చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా, తన ఫ్యాన్స్ ను మెప్పించాలంటే ప్రభాస్ కూడా ఒక సల్మాన్ ఖాన్, ఒక టైగర్ ష్రాఫ్‌ తరహాలో షర్ట్ విప్పేసి ఒక్క ఫైటన్నా డ్యాన్సన్నా చేయాల్సిందేనేమో.

ఇకపోతే ప్రభాస్ ఆల్రెడీ టీజర్ తో ఊరించేశాడు కాబట్టి, ఎప్పుడెప్పుడు ట్రైలర్ అలాగే సాంగ్స్ ను రిలీజ్ చేస్తాడా అంటూ బాలీవుడ్ బాబులు కూడా వెయిటింగులో దిగారు. ఓ విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా లవ్వర్స్ అందరూ సాహో టైమ్ స్టార్ట్ చేశారు. జస్ట్ ధియేటర్లలో ఎప్పుడొస్తుందా అని వెయిటింగ్ అంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English