తమన్నా బిస్కెట్లు ఇవాళ పనికొస్తాయా?

తమన్నా బిస్కెట్లు ఇవాళ పనికొస్తాయా?

ప్రభాస్ గురించి అమ్మాయిలు ఎగబడుతున్నారు అంటూ కామెంట్ చేయడం.. శ్రీదేవి బయోపిక్ లో శ్రీదేవి రోల్ చేయాలని ఉందని చెప్పడం.. ఇండియాలో తీసే టాప్ డ్యాన్స్ సినిమాలో నటించాలని ఉందని చెప్పడం.. ఏంటో ఈ కోరికలన్నీ.. బిస్కెట్లు టైపులో ఉన్నాయి.. అంటూ మిల్కీ బ్యూటి తమన్నా మాటలు విన్నవారు ఎవరైనా కూడా చెబుతారు. కాని మిల్కీ బిస్కెట్లన్నీ కూడా ఈ శుక్రవారం కోసమే.

ఈరోజు 'ఖామోషి' అంటూ తమన్నా లీడ్ రోల్ చేసిన హారర్ సినిమా రిలీజవుతోంది. బిల్లా 2 సినిమా తీసిన చక్రి తోలేటి హిందీలో ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. ఒక ఫారిన్ నిమాను యాజిటీజ్ ఎత్తేసి తీసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోలేదు కాని, సినిమా ప్రమోషన్లో తమన్నా వేసిన బిస్కెట్లు మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ఆమె చెప్పిన ఆ సంగతులకూ అస్సలు సంబంధం లేదు కాబట్టి. ప్రభాస్ పెళ్ళి టాపిక్ తమన్నా చెప్పక్కర్లేదు. ఇక శ్రీదేవి రోల్ అనేది ఇంపాజిబుల్. బోని కపూర్ మాహా అవసరమైతే తన కూతురు జాన్వి కపూర్ ను శ్రీదేవిగా పెట్టి సినిమా తీస్తాడేమోకాని, తమన్నాను మాత్రం తీసుకోడు. సో వీటి గురించి తమన్నా ఎందుకు మాట్లాడిందో ఆమెకే తెలియాలి.

ఇక ఇండియాలో డ్యాన్స్ సినిమాలంటే.. వరుణ్‌ దావన్ చేస్తున్న ఎబిసిడి సినిమాలో. వాటిలో తీసుకుందామంటే తమన్నా ఆ కుర్ర హీరోలకంటే ముదురుగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడా కష్టమే. ఏదన్నా ఐటెం సాంగ్ కావలంటే చేసుకోవచ్చు. ఈ ఎనాలసిస్ పక్కన పెడితే, ఈ మాటలన్నీ విన్న జనం.. ఖామోషి సినిమా ధియేటర్లకు వస్తారా? చూద్దాం.. కాసేపట్లో తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English