'సాహో'లో ఆ రెండూ క్లిక్ అయితేనా..

'సాహో'లో ఆ రెండూ క్లిక్ అయితేనా..

యావత్ సినీ జగత్తును 'సాహో' టీజర్ కట్టిపాడేసింది. అందరికీ టీజర్ తెగ నచ్చేసింది. అసలు ఆ రేంజు యాక్షన్ మన ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఎవ్వరూ రూపొందించలేదు కాబట్టి, ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోయారు. ఎట్రాక్ట్ అయిపోయారు. అయితే అన్నీ బాగున్నా కూడా రెండు విషయాల్లో మాత్రం సాహో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి క్లిక్ అయితేనే అందరికీ సినిమా నచ్చుతుంది.

ముఖ్యంగా సాహో సినిమాకు అత్యవసరమైంది ఏంటంటే.. డ్రామా. కేవలం స్టంట్లతో స్ర్కీనంతా నింపేసి, కావల్సినంత డ్రామా పెట్టకపోతే మాత్రం, సినిమా వర్కవుట్ కాదు. ఈ మధ్యన వచ్చిన రోబో 2.0, రేస్ 3 వంటి సినిమాల్లో అదే పెద్ద ప్రాబ్లమ్. కాబట్టి సాహోలో డ్రామా పండితేనే, ఈ యాక్షన్ సీక్వెన్సులకు విలువ ఉంటుంది. మొన్నొచ్చిన మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్ సినిమాలో స్టంట్లు అదిరిపోయాయ్ కాని, డ్రామా మాత్రం పండలేదు. కాకపోతే హాలీవుడ్ సినిమా కాబట్టి, వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి, 200 మిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందిస్తే, 800 మిలియన్ డాలర్లు నెట్ వసూళ్ళు వచ్చాయి.

ఇకపోతే ఆ రెండో పాయింట్ ఏంటంటే.. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అంతా కూడా టాప్ క్వాలిటీలో ఉండాలి. మనోళ్లు గ్రాఫిక్స్ ఎంత కష్టపడి ఖర్చుపెట్టి చేయించానా కూడా ఎందుకో హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ మాత్రం కనిపించదు. అలా ఉండకపోయినా పర్లేదు కాని, మరీ లోకల్ క్వాలిటీ తరహాలో ఉండకూడదు. డ్రామా అండ్ గ్రాఫిక్స్ సరిగ్గా సెట్టయితే మాత్రం సాహో రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English