ప్చ్‌..! ఈ విషయం ఇబ్బందిగానే ఉంది

వైసీపీలో ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. అంతకు మించి గుస‌గుస‌గా చ‌ర్చ‌నీయాంశంగా త‌యారైంది. ముఖ్యంగా తాడేప‌ల్లి వ‌ర్గాలు ఈ విష‌యంపై చ‌ర్చ‌కు తావిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని అంటున్నారు పార్టీ నేత‌లే! దీనికి కార‌ణం.. చూస్తే.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తిప‌క్షాల దాడి ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కూడా ప్ర‌తిప‌క్షాలు భారీ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో.. విప‌క్షాల‌కు సరైన విధంగా స‌మాధానం చెప్పాల‌ని.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా జ‌గ‌న్ అభిమానులుగా ఉన్న‌వారు భావిస్తున్నారు.

వీరిలో అనంత‌పురం నుంచి విశాఖ వ‌ర‌కు.. చాలా మందే క‌నిపిస్తున్నారు. కానీ.. ఒక‌రిద్దరికి త‌ప్ప‌..ఛాన్స్ ద‌క్క‌డం లేదు. అది కూడా.. నేరుగా మీడియాతో మాట్లాడ‌డానికి లేద‌ని.. స్ప‌ష్టంగా ఆదేశాలు ఉన్నాయ‌ని చ‌ర్చ సాగుతోంది. నిజ‌మే.. ఎవ‌రు బ‌డితే.. వారు మీడియాతో మాట్లాడ‌కూడద‌నే ఉద్దేశంతోనే అధికార ప్ర‌తి నిధుల‌ను పార్టీలు నియ‌మించుకుంటాయి. అలానే వైసీపీలోనూ అధికార ప్ర‌తినిధులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వారు కూడా ఎక్కువ మంది మీడియా ముందుకు రావ‌డం లేదు.

ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యం చ‌ర్చ‌కు దారితీసిం ది. దీనిని ప‌రిశీలిస్తే.. అధికార ప్ర‌తినిధులు కూడా తాడేప‌ల్లి నుంచి అనుమ‌తి పొందాల్సిన ప‌రిస్థితి ఏర్ప డింద‌ని అంటున్నారు. అంటే. ఒక కీల‌క స‌ల‌హాదారు అనుమ‌తి ఉంటే త‌ప్ప‌.. అధికార ప్ర‌తినిధి అయిన ప్ప‌టికీ.. మీడియా ముందుకు రాకూడ‌ద‌నే క‌ట్టుబాటును అమ‌లు చేస్తున్నార‌ట‌. దీంతోటీడీపీ స‌హా ఇత‌ర పార్టీల నుంచి ఎదుర‌వుతున్న సూటి పోటి విమ‌ర్శ‌ల‌కు తాము స‌మాధానం చెప్ప‌లేక పోతున్నామ‌ని అంటున్నారు.

ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం ప‌రిశీలించాల‌ని నాయ‌కులు కోరుతున్నారు. ఎక్క‌డ అవ‌స‌ర‌మైతే.. అక్క డ ఎప్పుడు అవ‌స‌రం అనుకుంటే.. అప్పుడు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఈ విష‌యంలో పీకులాట ఎందుకని నాయ‌కులు కోరుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.