సందీప్‌ కిషన్‌ డబ్బులు సేఫ్‌!

సందీప్‌ కిషన్‌ డబ్బులు సేఫ్‌!

హీరోగా వరుస పరాజయాలు చవిచూస్తోన్న టైమ్‌లో నిర్మాతగా మారడం ఎవరికైనా రిస్కే. అది కానీ మిస్‌ఫైర్‌ అయితే అటు విజయాలు రాకపోగా ఇటు చేతిలో వున్న డబ్బులు కూడా హరించుకుపోతాయి. కానీ నితిన్‌ని, నాగ శౌర్యని చూసి ఇన్‌స్పయిర్‌ అయిన సందీప్‌ కిషన్‌ తనకి నచ్చిన కథ దొరకడంతో ఛాన్స్‌ తీసుకున్నాడు. హారర్‌ సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడని సందీప్‌ కిషన్‌ ఆ జోనర్‌ సినిమాలకి వున్న గిరాకీ చూసి ఒక హారర్‌ సినిమాని స్వయంగా తానే నిర్మించాడు.

'నిను వీడని నీడను నేనే' అంటూ సందీప్‌ కిషన్‌ నిర్మించిన సినిమా అతని డబ్బులకి అయితే ఎసరు పెట్టలేదు. ఈ చిత్రం టీజర్‌ చాలా బాగుండడంతో ఇమ్మీడియట్‌గా బిజినెస్‌ జరిగిపోయింది. సందీప్‌ కిషన్‌ పెట్టుబడికి మించిన డబ్బులే వెనక్కి వచ్చాయి. ఇంకా కొన్ని రైట్స్‌ కూడా అతని వద్దే వున్నాయి. ఈ చిత్రం కమర్షియల్‌ ఫలితం ఎలాగున్నా కానీ నిర్మాతగా సందీప్‌కి ఈ చిత్రం సక్సెస్‌ని విడుదల కాకముందే ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని పెద్ద సినిమాలేవీ లేని టైమ్‌లో సేఫ్‌గా రిలీజ్‌ చేసి హీరోగాను తన ఫ్లాపులకి బ్రేక్‌ వేయాలని సందీప్‌ ఎదురు చూస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌ సందీప్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English