బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు భలేగున్నారే!

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు భలేగున్నారే!


బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌ అనే కారణంతో పాటు ఈ రియాలిటీ షో ఏదో కొత్తగా వుందనే క్యూరియాసిటీ కూడా దోహదపడింది. ఆ సీజన్‌కి రికార్డ్‌ టీఆర్పీలు నమోదయ్యాయి. సెకండ్‌ సీజన్‌ కౌశల్‌ ఫ్యాక్టర్‌ వల్ల సోషల్‌ మీడియాలో ఎంత పాపులర్‌ అయినా కానీ టీఆర్పీల పరంగా మొదటి సీజన్‌ని మ్యాచ్‌ చేయలేకపోయింది. ఎన్టీఆర్‌తో పోలిస్తే నాని స్టార్‌ వేల్యూ చాలా తక్కువ కావడం కూడా దీనికి కారణమే అని చెప్పాలి. ఈసారి అటు రెగ్యులర్‌ టీవీ ప్రేక్షకులతో పాటు సోషల్‌ మీడియా బ్యాచ్‌ని కూడా ఆకర్షించేలా కంటెస్టెంట్లని తీసుకుంటున్నారు. సీరియల్‌ నటుడు జాకీ, యాంకర్‌ లాస్యతో పాటు మరో ఇద్దరు యువ యాంకర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరి వల్ల టీవీ సీరియల్స్‌, గేమ్‌ షోస్‌ చూసే మహిళలు బిగ్‌బాస్‌ షో చూస్తారని అంచనా వేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యమ పాపులర్‌ అయిన మహాతల్లి, ఉప్పల్‌ బాలు కూడా ఈ సీజన్‌లో భాగమేనంటున్నారు. సింగర్‌ హేమచంద్రతో పాటు విప్లవాత్మక ఇంటర్వ్యూలు ఇచ్చే గాయత్రి గుప్తా కూడా లిస్టులో వుందట. ప్రతి కంటెస్టెంట్‌ పాపులర్‌ అయితే సీజన్‌ రక్తి కడుతుందని ప్రతి ఒక్కరినీ ఆచి తూచి ఎంచుకుంటున్నారు. ఈ సీజన్‌ని నాగార్జున హోస్ట్‌ చేస్తారు. మన్మథుడు 2 చిత్రాన్ని ప్రమోట్‌ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్‌ఫామ్‌ అవుతుందని అందుకు అనుగుణంగా ఆ సినిమా విడుదల కూడా ప్లాన్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English