ప్రభాస్‌కి అంత ఈజీ కాదు!

ప్రభాస్‌కి అంత ఈజీ కాదు!

సాహో చిత్రం పట్ల వున్న ఆసక్తి ఏమిటనేది టీజర్‌కి వస్తోన్న వ్యూసే చెబుతున్నాయి. టీజర్‌ రిలీజ్‌ చేసిన ఆరు గంటలలో ఇరవై అయిదు మిలియన్ల వ్యూస్‌ రాబట్టుకున్న సాహో దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకి ఈ చిత్రంపై వున్న ఆసక్తిని తెలియజేసింది. అయితే బాహుబలి చిత్రాలకి దక్కినట్టుగా సాహోకి ఫ్రీ గ్రౌండ్‌ అయితే దక్కదు. హిందీలోనే ఈ చిత్రం అక్షయ్‌కుమార్‌ నటిస్తోన్న మిషన్‌ మంగళ్‌తో అమీ తుమీ తేల్చుకోక తప్పదు. సాహో ఆగస్టు 15న విడుదలవుతోందంటే అక్షయ్‌కుమార్‌ సినిమా మేకర్స్‌ అసలు ఖాతరు చేయడం లేదు. బాహుబలి హీరో అయితే అయి వుండొచ్చు కానీ ప్రభాస్‌కి అక్షయ్‌తో పోటీ పడేంత మార్కెట్‌ లేదని వాళ్లు నమ్ముతున్నారు.

అక్షయ్‌కుమార్‌ సినిమాలకి ఎదురు వెళ్లిన పెద్ద సినిమాలు పలుమార్లు దెబ్బ తిన్నాయి. బాలీవుడ్‌ సూపర్‌స్టార్లకే ఎసరు పెట్టిన హిస్టరీ అతనికి వుంది. దీంతో సాహో కోసం తమ సినిమా వాయిదా వేయాల్సిన అవసరం లేదనే అతి విశ్వాసం సదరు నిర్మాతలలో వ్యక్తమవుతోంది. సాహో ఎంత బాగున్నా కానీ అక్షయ్‌కుమార్‌ చిత్రం వల్ల ఓపెనింగ్స్‌ పరంగా గ్రాస్‌కి గండి పడుతుంది. అక్షయ్‌ చిత్రానికి ఎంత కాదన్నా పాతిక కోట్ల స్థాయిలో ఓపెనింగ్‌ వస్తుంది కనుక ఆ మేరకు సాహో వసూళ్లకి వెలితి తప్పదనే ట్రేడ్‌ అంటోంది. మరి ఈ సమస్యని ఇరు చిత్రాల నిర్మాతలు కలిసి పరిష్కరించుకుంటారో లేక ఏదైతే అదయిందంటూ బాక్సాఫీస్‌ వద్దే తేల్చుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English