రాజమౌళి పేరు చాలు.. హీరోలు అక్కర్లేదు!

రాజమౌళి పేరు చాలు.. హీరోలు అక్కర్లేదు!

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రానికి తెలుగు మార్కెట్‌ వరకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌తో అద్భుతాలు ఆశించవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాలు, ఒక పాయింట్‌ వరకు కర్నాటక దాటితే ఈ హీరోలు ఇద్దరికీ అంత పేరు లేదు. నార్త్‌ ఇండియాలో అయితే వీళ్ల పేర్లు చెప్పగానే గుర్తించే వాళ్ల కంటే గూగుల్‌ చేసి చూసే వాళ్లే ఎక్కువ వుంటారు. అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తోన్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రానికి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి. ఈ చిత్రం అన్ని భాషల ఓవర్సీస్‌ రైట్స్‌కి అరవై అయిదు కోట్ల రూపాయలు వచ్చాయి.

బాహుబలి రెండవ భాగం కంటే ఎక్కువ ఆఫర్‌ ఇవ్వడమే కాకుండా ఇంకా విడుదలకి ఏడాది పైగా సమయం వుండగా సింగిల్‌ పేమెంట్‌లో ఈ డీల్‌ క్లోజ్‌ అయిపోయింది. దీనికి పూర్తిగా రాజమౌళి బ్రాండ్‌ కారణమంటే కాదు అతిశయోక్తి. రాజమౌళి కనుక ఏదో అద్భుతం చేసేస్తాడనే నమ్మకంతోనే ఇంత రేటు పెట్టి రైట్స్‌ తీసుకున్నారు. మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి అన్ని భాషలలో కలిపి, అన్ని హక్కులు కలుపుకుని అయిదు వందల కోట్ల వరకు బిజినెస్‌ జరుగుతుందనే అంచనాలున్నాయి. నార్త్‌ ఇండియాలో అయితే హీరోలెవరనేది కూడా లేకుండా రాజమౌళి బ్రాండ్‌ మీద బ్లయిండ్‌గా బెట్‌ కట్టడానికి పలు సంస్థలు సిద్ధంగా వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English