అజిత్.. వృద్ధ నారీ పతివ్రత

అజిత్.. వృద్ధ నారీ పతివ్రత

హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి పాత్రా ఒప్పేసుకుంటాడు. గ్లామర్ ఒలకబోసేస్తుంటారు. కానీ తమకంటూ ఒక గుర్తింపు సంపాదించాక ముందు చేసిన పాత్రల గురించి ఫీలైపోతుంటారు. తమ ప్రతిభను గుర్తించలేదని వాపోతారు. ముందు చేసిన పాత్రల విషయంలో రిగ్రెట్ అవుతుంటారు. తాప్సి, ఇలియానా లాంటి చాలా మంది హీరోయిన్లు ఇలా వయ్యారాలు పోయిన వాళ్లే. తమిళ స్టార్ హీరో అజిత్ సైతం ఇలాగే మాట్లాడుతున్నాడు. తాను ఒకప్పుడు చేసిన పాత్రల విషయంలో ఇప్పుడు చింతిస్తున్నాడు. ఒకప్పుడు తాను అమ్మాయిల వెంట పడే.. వాళ్లను ఏడిపించే పాత్రలు చేశానని.. అలాంటి పాత్రలు చేసినందుకు ఇప్పుడు ఫీలవుతున్నానని అజిత్ పేర్కొనడం విశేషం. ఇంకెప్పుడూ తాను అలాంటి పాత్రలు చేయనని.. మహిళల్ని గౌరవించేలాగే తన పాత్రలు, సినిమాలు ఉండేలా చూసుకుంటానని అన్నాడు అజిత్. ఇంతకుముందు తాను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ‘నీర్కొండ పార్వై’ సినిమా చేసినట్లుగా అతను చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్. ఇది మహిళల మనోభావాలు.. శీలం.. వ్యక్తిత్వం లాంటి అంశాల చుట్టూ తిరిగే ఉదాత్తమైన కథ. నిన్ననే రిలీజైన దీని టీజర్ ఆకట్టుకుంది. తిరుగులేని మాస్ హీరో అయిన అజిత్.. ఇలాంటి సినిమాలో కీలక పాత్ర చేయడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ట్రైలర్ రిలీజైన నేపథ్యంలోనే అజిత్ పై వ్యాఖ్యలు చేశాడు. కానీ కెరీర్లో చాలా త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించిన అజిత్.. తాను వద్దనుకుంటే చాలా పాత్రల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ అమ్మాయిల్ని ఏడిపించే పాత్రలు చేశాడు. కానీ ఇప్పుడు నడి వయసుకు వచ్చి అందుకు తగ్గ పాత్రలే చేస్తున్నాడు. ఇంత ఇమేజ్ సంపాదించాక అమ్మాయిల వెంట పడే పాత్రలు చేయలేడు. కాబట్టి ఇప్పుడు భలే కబుర్లు చెబుతున్నాడంటూ ‘వృద్ధ నారీ పతివ్రత’ సామెతను బయటికి తీస్తున్నారు జనాలు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English