వాళ్లే భయపడుతుంటే నాగ్ ధైర్యమేంటి?

వాళ్లే భయపడుతుంటే నాగ్ ధైర్యమేంటి?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్, ఫాలోయింగ్ ఎలా పెరిగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి కొత్త సినిమా ‘సాహో’ మీద దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి నిలిచి ఉంది. ఈ ఏడాదికి అదే మోస్ట్ అవైటెడ్ మూవీ. దాని టీజర్ ఈ రోజు రిలీజవుతుంటే.. మొత్తం సోషల్ మీడియా అంతా దాని మీదే ఫోకస్ పెట్టింది. టీజర్ రిలీజయ్యాక యూట్యూబ్ షేకైపోయిింది. ఇప్పటిదాకా ఉన్న ఇండియన్ టీజర్ రికార్డులన్నింటినీ అది బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి మేనియా ఉన్న సమయంలోనే అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘మన్మథుడు-2’ టీజర్ కూడా రిలీజ్ చేయాలనుకోవడం సాహసమే. ‘సాహో’ టీజర్ వచ్చిన గంటన్నరకే ఇది కూడా ల్యాండ్ అయింది. టీజర్ ఆసక్తికరంగానే ఉండటంతో కొంత మేర అటెన్షన్ రాబట్టుకుంది. కానీ ‘సాహో’తో పోటీ లేకుండా వేరే సమయంలో టీజర్ లాంచ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐతే టీజర్‌తో టీజర్ పోటీ పడితే జరిగే నష్టం కంటే ‘సాహో’ లాంటి సినిమాతో ‘మన్మథుడు-2’ సినిమా పోటీ పడితే మాత్రం కష్టమే. ఐతే డైరెక్ట్ ఫైట్ అనలేం కానీ.. కొంత మేరే ‘సాహో’తో క్లాష్‌కు రెడీ అయిపోతోంది ‘మన్మథుడు-2’. ఆగస్టు 15న ‘సాహో’ విడుదల కానుండగా.. ఆరు రోజుల ముందు, అంటే ఆగస్టు 9న ‘మన్మథుడు-2’ను రిలీజ్ చేస్తున్నారు. ఇది పెద్ద సాహసం అనే చెప్పాలి. ‘సాహో’ను చూసి బాలీవుడ్ వాళ్లే బెదురుతున్నారు. ఆగస్టు 15కు షెడ్యూల్ అయిన వేరే సినిమాల్ని వాయిదా వేసేలా కనిపిస్తున్నారు. ఆ వీకెండ్‌తో పాటు ముందు, వెనుక వారాంతాల్లో మరే భాళలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ నాగ్ మాత్రం ప్రభాస్ సినిమాను ఢీకొట్టడానికి రెడీ అయిపోయాడు. సాహో’ 15న రిలీజ్ అంటే.. 14నే యుఎస్ ప్రిమియర్ల హంగామా ఉంటుంది. అంటే ‘మన్మథుడు-2’కి మిగిలే గ్యాప్ కేవలం ఐదు రోజులు. ఈ ఐదు రోజుల్లోనే ఎంత లాగాలో అంత లాగాలి. ‘సాహో’ వచ్చాక ప్రేక్షకుల దృష్టి పూర్తిగా దాని మీదకి మళ్లుతుంది. ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ‘మన్మథుడు-2’ నిలబడటం కష్టమే. ఇదంతా తెలిసి తన సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నాడంటే నాగ్ ధీమా ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English