నాగార్జున సెక్స్‌ స్టోరీ ఇచ్చిన షాక్‌!

నాగార్జున సెక్స్‌ స్టోరీ ఇచ్చిన షాక్‌!

నాగార్జున ట్రెండ్‌ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా తనని తాను అప్‌డేట్‌ చేసుకుంటాడనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు రాజ్యమేలుతోన్న సెక్స్‌ థీమ్స్‌కి కూడా నాగార్జున ఎడాప్ట్‌ అవుతారని, ఫాన్స్‌కి కూడా షాక్‌ తగిలేలా సెక్స్‌ స్టోరీతో వస్తారని మాత్రం ఎవరూ ఊహించి వుండరు. మన్మథుడు 2 సీక్వెల్‌ అంటే... మహా అయితే స్త్రీలోలుడు అనే హింట్స్‌ మాత్రం వుంటాయని అనుకుంటే... ఏకంగా 'నేను ప్రేమలో పడను. సెక్స్‌ మాత్రమే చేస్తాను' అంటూ స్వయంగా నాగార్జునతోనే డైలాగ్‌ చెప్పించి షాక్‌ ఇచ్చారు. వయసు మళ్లిపోయినా పెళ్లి కాని అపర బ్రహ్మచారి ఒక్కసారిగా స్త్రీ సాంగత్యంలో పేట్రేగిపోతే అనేదే 'మన్మథుడు 2' కాన్సెప్టు. కొన్ని సెకన్ల టీజర్‌లోనే గీత దాటేసిన సందర్భాలు కోకొల్లలు.

ఇక సినిమాలో ఇంకెన్ని విపరీతాలు వుంటాయనేది తెలియదు. టీజర్‌లో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని చూపించకపోయినా కానీ నాగార్జున ఏజ్‌పై సెటైర్లతో బాగానే నవ్వించారు. కాకపోతే కొసమెరుపుగా చూపించిన రియల్‌ 'మన్మథుడు' యాంగిల్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ షాక్‌ అవుతారు. అప్పటి మన్మథుడు ఫ్యామిలీతో కలిసి చూసే సరదా సినిమా అయితే ఈ మన్మథుడు టీజర్‌కి కూడా పిల్లల చెవులు, కళ్లు మూసేస్తారు తల్లిదండ్రులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English