బాబోయ్‌... సునీల్‌కి ఇదేం పిచ్చి!

బాబోయ్‌... సునీల్‌కి ఇదేం పిచ్చి!

కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ దక్కించుకుని రోజుకి లక్షల్లో సంపాదించే రోజుల్లో హీరోగా మారిపోతే కోట్లు వస్తాయనే తప్పుడు లెక్క వేసాడు సునీల్‌. హీరోగిరీ మొదట్లో బాగానే వెలగబెట్టినా ఆ తర్వాత మాత్రం సినిమాని అంతటినీ లాగడం తన వల్ల కాదని తెలుసుకున్నాడు. వరుస పరాజయాలతో మళ్లీ కామెడీ వేషాలకి షిఫ్ట్‌ అయినా కానీ ఇప్పటికీ హీరోగా మరో ఛాన్స్‌ వస్తుందని చూస్తున్నాడు. ఈసారి హీరో వేషమేస్తే మునుపు చేసిన తప్పులు రిపీట్‌ చేయకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నాడు.

ఇదిలావుంటే సునీల్‌కి మరో పిచ్చి కూడా వుందట... డైరెక్షన్‌ చేయాలని. నటుడు కాకముందు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోనే చేసిన సునీల్‌ తనలోని దర్శకుడిని బయటకి తీసుకు వచ్చే టైమ్‌ వచ్చిందని భావిస్తున్నాడట. తనకి కమెడియన్‌ వేషం ఇచ్చిన హీరోలతో షాట్‌ గ్యాప్‌లో 'మనం సినిమా చేద్దాం' అంటూ కథలు చెప్పేస్తున్నాడట. సీనియర్‌ యాక్టర్‌ కదా అని కాస్త క్లోజ్‌గా వుంటే... తనకి డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఇవ్వమంటూ పోరు పెడుతున్నాడట. ఎంత మొహమాట పెట్టినా ఇంతవరకు సునీల్‌ గాలానికి ఎవరూ పడలేదట. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా తనలో ఓ త్రివిక్రమ్‌ వున్నాడు... వాడుకోమని అంటున్నాడట. చూస్తుంటే సునీల్‌ కుదురుగా కొన్నాళ్లు కామెడీ చేసేలా లేడనే కామెంట్లు పడుతున్నాయి చిత్రపురిలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English