సాహోకి సాగిల పడిపోయారంతే!

సాహోకి సాగిల పడిపోయారంతే!

బాహుబలి తర్వాత చేస్తోన్న సినిమాని బాలీవుడ్‌ మార్కెట్‌ దృష్టిలో పెట్టుకుని చేస్తోంటే... ప్రభాస్‌ అనవసరంగా ఉట్టికి ఎగురుతున్నాడని, బాహుబలి మాదిరిగా తన సినిమాలకి అక్కడ క్రేజ్‌ రాదని చాలా మంది కామెంట్‌ చేసారు. కానీ సాహో టీజర్‌ రిలీజ్‌ చేస్తే తెలుగులో కంటే హిందీ నుంచే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 'ఇది హాలీవుడ్‌ సినిమాలా వుంది' అంటూ నార్త్‌ ఆడియన్స్‌ అంటున్నారు. 'బాహుబలి'తో హిందీ సినిమా వల్ల కాని అయిదు వందల కోట్ల వసూళ్లని సాధించిన ప్రభాస్‌ మరోసారి బాలీవుడ్‌ సినిమాలని తలదన్నే వసూళ్లని తీసుకొస్తాడనే పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఫస్ట్‌ లుక్‌ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడేట్టు చేయడం అత్యంత కీలకం. సాహో బృందం చాలా టైమ్‌ తీసుకున్నా కానీ ఫస్ట్‌ టీజర్‌తో టార్గెట్‌ రీచ్‌ అయ్యారు. ఈ చిత్రంవైపు పక్క రాష్ట్రాల జనం చూపు తిప్పేలా చేయడం అతి పెద్ద పరీక్ష కాగా, టీజర్‌తో ఆ పరీక్షలో డిస్టింక్షన్‌ సాధించారు. ఇక ఈ చిత్రం పట్ల ఏర్పడిన ఆసక్తిని పెంచుతూ పోతే బాలీవుడ్‌ సినిమాలకి తీసిపోని ఓపెనింగ్స్‌ ఎందుకు రావు? అయితే టీజర్‌ అంతటిలోను యాక్షనే ఎక్కువ కనిపించింది తప్ప ఇంకో ఎమోషన్‌ ఏమీ లేదు. ట్రెయిలర్‌లో అన్ని అంశాలు ప్యాక్‌ చేసుకుంటే అప్పుడు ఈ కంప్లయింట్‌ కూడా వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English