మహేష్‌ను మబ్బులు కమ్మేశాయా?

మహేష్‌ను మబ్బులు కమ్మేశాయా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మూసలో వెళ్లిపోతున్నాడన్న విమర్శలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. అతడి లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ఏదో  అలా ఆడేసి వెళ్లిపోయింది కానీ.. ఈ సినిమా విషయంలో ఎవ్వరూ అంత సంతృప్తిగా లేరు. మహేష్ అండ్ కో దీన్ని ‘ఎపిక్ బ్లాక్ ‌బస్టర్’ అని చెప్పుకుంటూ గొప్పలు పోయింది కానీ.. ఆ సినిమాకు అంత సీన్ లేదని అందరికీ తెలుసు. స్వయంగా మహేష్ అభిమానులే ఈ సినిమా విషయంలో అసంతృప్తితో ఉన్న సంగతి వాస్తవం. మహేష్ ఇకపై ఇలాంటి రొటీన్ క్యారెక్టర్లు చేయొద్దని.. వైవిధ్యం చూపించాలని ఆశిస్తున్నారు. మహేష్‌ ఎలాంటి పాత్ర అయినా చేయగల.. కొత్తదనం చూపించగల నటుడని.. అతడిని దర్శకులు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని.. కొత్తగా చూపించట్లేదని వారిని తప్పుబడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుల్నే తప్పుబట్టి ప్రయోజనం లేదు.
తనను కొత్తగా చూపించే అవకాశమున్న దర్శకుల్ని కాదని.. మామూలు డైరెక్టర్లను ఆశ్రయిస్తుండటం మహేష్ తప్పు.

సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కాదని అనిల్ రావిపూడి చిత్రాన్ని ముందుకు తెచ్చింది మహేషే. సుక్కు సినిమా కోసం శారీరకంగా చాలా కష్టపడాల్సి ఉంటుందని, లుక్ మార్చుకుని దాదాపు పది నెలలు ఈ సినిమాకే అంకితం కావాల్సి ఉంటుందని.. ఇంత కష్టం ఎందుకని అనిల్ సినిమాను ముందుకు తెచ్చాడు. దీంతో సుక్కు అలిగి బన్నీతో ఆ కథ చేయడానికి సిద్ధపడిపోయాడు. అది మిస్సయితే అయిందిలే.. ఇంతకుముందు కమిటైన సందీప్ రెడ్డి వంగా సినిమా అయినా చేస్తే మహేష్‌ను కొత్తగా చూడొచ్చని అభిమానులు ఆశించారు. ఈ కాంబినేషన్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించేదే. సందీప్ ఎలాంటి సినిమా తీసినా.. మహేష్‌కు అది కొత్తగానే ఉంటుంది. కానీ అతను ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. ‘కబీర్ సింగ్’ పూర్తి చేసుకుని టాలీవుడ్‌కు తిరిగొస్తున్న మహేష్.. వెంటనే కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట.

అనిల్ సినిమా తర్వాత మళ్లీ వంశీ పైడిపల్లితోనే సినిమా చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఉంటుందో లేదో కానీ.. సందీప్‌తో అయితే ఇప్పుడిప్పుడే మహేష్ సినిమా చేయడంటున్నారు. ఇలా తనను కొత్తగా చూపించే దర్శకుల్ని కాదని.. రొటీన్ సినిమాలతోనే సాగిపోవాలని మహేష్ ఎందుకు అనుకుంటున్నాడో మరి. అతను కష్టపడటానికి సిద్ధంగా లేడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English