ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం వీడియో వైరల్

ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిన్ననే తొలిసారి అసెంబ్లీ సమావేశమైంది. ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని చిత్రాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేయడం నిన్నంతా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఐతే మరో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ఎం.బాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో అది. పాపం ఆ ఎమ్మెల్యేకు తెలుగు చదవడం వచ్చినట్లు లేదు. ఒక్క పదం కూడా సరిగ్గా చదవలేకపోయారు. పదానికి పదానికి సంబంధం లేకుండా ఏది పడితే అది చెబుతూ పోయారు.

''నేను అని.. సభామూలింగా.. నిర్మమైన రాజ్యాంగం పట్ల నిర్మస్తున్నాను. ఈ రోజు నుంచి భారత దేశంలో అసమగ్రహంగా పాటిస్తానని.. నేను ప్రత్యేకంగా.. కర్తవ్యంగా నిర్మస్తున్నాను. దైవ సాక్షింగా.. నేను అని బాబు అని ఎం.బాబు అని.. కాబట్టి వాటిని సమ్మహంగా పాటిస్తానని దైవ సాక్షిగా చూస్తున్నాను''.. ఇదీ గౌరవనీయ ఎమ్మెల్యే చేసిన ప్రమాణం. ఇది కూడా యాజిటీజ్‌గా బాబు చేసిన ప్రమాణం కాదు. అక్కడక్కడా కొన్ని పదాలు అసలే అర్థం కాలేదు. పక్క నుంచి ఎవరో పదాలు అందిస్తున్నా కూడా ఆయన అందుకుని సరిగా మాట్లాడలేకపోయారు. తెలుగు చదవడం రాకపోవడం, పైగా స్టేజ్ ఫియర్ ఆయన ఇలా తడబడేలా చేసినట్లుంది. తెలుగు చదవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే.. ఫార్మాట్ ఫాలో కాకుండా నాలుగు ముక్కలు ముందే ప్రాక్టీస్ చేసి ఏదో అలా లాగించేయాల్సింది. కానీ ఇలా అందరి లాగే ప్రమాణం చేయాలని ప్రయత్నించి సోషల్ మీడియాకు దొరికిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English