రవితేజకి ఇప్పుడు సీన్‌ లేదంటోన్న శృతి!

రవితేజకి ఇప్పుడు సీన్‌ లేదంటోన్న శృతి!

సినిమా కెరియర్‌ కంటే బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి బెస్ట్‌ అని చెప్పి విదేశాలకి వెళ్లిపోయిన శృతిహాసన్‌ పెళ్లి కాకుండానే అతడితో చాలా కాలం సహ జీవనం చేసింది. పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించినా కానీ చివరకు ఇద్దరికీ కుదరకపోవడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. శృతిహాసన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బ్రేకప్‌ చెప్పిన బాయ్‌ఫ్రెండ్‌ ఇప్పుడు తన దేశంలో, తన పనిలో తానున్నాడు. దీంతో శృతిహాసన్‌ తిరిగి నటిస్తానంటూ వచ్చేసింది కానీ ఇంకా పెద్ద సినిమా ఏదీ తగల్లేదు.

రవితేజ, శృతిహాసన్‌తో బలుపు తీసిన గోపిచంద్‌ మలినేని మళ్లీ ఇదే కాంబినేషన్‌ రిపీట్‌ చేద్దామనుకున్నాడు. శృతిహాసన్‌ ఫీల్డుకి దూరంగా వుంది కానీ ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏమిటనే దానిపై అప్‌డేటెడ్‌గానే వుంది. రవితేజకి ఈమధ్య మార్కెట్‌ పడిపోయి సినిమాలు అస్సలు ఆడడం లేదనేది ఆమెకి బాగా తెలుసు. అందుకే రవితేజతో సినిమా చేయాలంటే కోటిన్నర పారితోషికం కావాలని అడిగింది.

ప్రస్తుతం శృతిహాసన్‌కి అంత డిమాండ్‌ లేకపోయినా ఇంత అడగడం ఏమిటని గోపీచంద్‌ మలినేనికి మైండ్‌ పోయిందట. అయితే రవితేజకి ఇప్పుడు మార్కెట్‌ లేదు కనుక, అతనితో నటిస్తే తనకి ఏదయినా పెద్ద సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్‌ అవుతుంది కనుక అందుకు బదులుగా ఎట్రాక్టివ్‌ పేచెక్‌ ఇవ్వాలని శృతి చెప్పిందట. ఇది నిజమే అయితే రవితేజ అర్జంటుగా పెద్ద హిట్‌ ఇచ్చి తన బలుపు చూపించాల్సిందే. ఏమంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English