సెక్సీ హీరోయినే.. దెయ్యాన్ని చేసేసారు!

 సెక్సీ హీరోయినే.. దెయ్యాన్ని చేసేసారు!

ఏదైనా ఒక తరహా పాత్రలో పరిచయమై, అది కానీ హిట్టయిందంటే ఇక ఆ హీరోయిన్‌ని అలాంటి పాత్రలకే పరిమితం చేయడం తెలుగు సినిమా వాళ్లకి బాగా అలవాటు. తొలి సినిమాలో దెయ్యంగా కనిపించి భయపెట్టిన నందిత శ్వేత నిజానికి సెక్సీ సుందరే.

కానీ ఆమెకి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వల్ల హారర్‌ సినిమాలకి బెస్ట్‌ అనే ముద్ర వేసేసారు. అవకాశాలు రాకపోవడంతో వచ్చినవే ఓకే చేయాలి కనుక తనకి దెయ్యం పాత్రలే ఇస్తున్నా కానీ నందిత ఆ పాత్రల్లోనే కనిపిస్తోంది. దీంతో నందిత శ్వేతకి ఇప్పుడు డెవిల్‌ ఇమేజ్‌ వచ్చేసింది. తనకి చెప్పే ప్రతి పది కథల్లో కనీసం ఏడయినా దెయ్యం కథలే వుంటున్నాయని, ప్రతి సినిమాలోను ఎలాగైనా దెయ్యం వేషం వేయించాలని చూస్తున్నారని నందిత వాపోతోంది.

మొదటి సినిమా హిట్టయిందని చాలా ఆనంద పడ్డాను కానీ ఇప్పుడు ఆ సినిమా ఎందుకు హిట్టయిందా అనిపిస్తోందని, తనలో చాలా టాలెంట్‌ వుందని, ఏ పాత్రనయినా రక్తి కట్టించగలనని, గ్లామరస్‌గా కనిపించడానికి కూడా సిద్ధంగా వున్నాననే మెసేజ్‌ని పాస్‌ చేయమని మీడియాని బతిమాలుతోంది. ఇటీవలే అభినేత్రి 2 అనే హారర్‌ సినిమాలో కనిపించిన నందిత త్వరలో అక్షర అనే మరో దెయ్యం పాత్రలో కనిపించనుంది. హతవిధీ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English