సినిమా రిలీజ్ ముంగిట మళ్లీ దర్శకుడికి గుండెపోటు

సినిమా రిలీజ్ ముంగిట మళ్లీ దర్శకుడికి గుండెపోటు

అంజలి కథానాయికగా ఐదేళ్ల కిందట ‘గీతాంజలి’ సినిమా హిట్ సినిమాను అందించిన రాజ్ కిరణ్ గుర్తున్నాడా? ఈ సినిమా తర్వాత అంచనాలు అందుకోలేకపోయాడతను. ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ లాంటి డిజాస్టర్లు వచ్చాయి రాజ్ నుంచి. తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని ‘విశ్వామిత్ర’ అనే సినిమా తీశాడు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాజ్ కిరణ్ నిర్మాణ భాగస్వామి కూడా. ఐతే రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్న రాజ్.. గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాజ్ తన సినిమా విడుదలకు ముందు ఇలా గుండెపోటుకు గురి కావడం తొలిసారి కాదు.

అతడి తొలి చిత్రం ‘గీతాంజలి’ రిలీజ్ ముంగిట కూడా ఇలాగే జరిగింది. కొన్ని రోజుల్లో సినిమా రాబోతుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీరిక లేకుండా ఉన్న అతను తీవ్ర ఒత్తడికి గురయ్యాడు. గుండెపోటుతో చికిత్స పొందాడు. ఇప్పుడు మరోసారి గుండెపోటు అనగానే అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలుగుతోంది. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రాజ్ తాను తీసిన ‘విశ్వామిత్ర’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో అతడి డబ్బులు కూడా ఉన్నాయి. కానీ నందిత కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ముందు నుంచి అసలు బజ్ లేదు. దీనికి అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా కాలేదు. అయినా విడుదలకు సిద్ధమైపోయారు. మరి రిలీజ్ విషయంలో ఏం తలనొప్పులు తలెత్తాయో ఏమో.. రాజ్ ఒత్తిడికి గురై ఆసుపత్రి పాలైనట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English