విజయ్‌ దేవరకొండని వణికించిన సినిమా

విజయ్‌ దేవరకొండని వణికించిన సినిమా

విజయ్‌ దేవరకొండ సినిమా వస్తుందంటే తమ సినిమాని వాయిదా వేయమని చాలా మంది హీరోలు కోరుకునే లెవల్‌కి అతను చేరిపోయాడు. విజయ్‌ సినిమాలకి ఇప్పుడు యూత్‌లో వున్న క్రేజ్‌ అలాంటిది మరి. అలాంటి విజయ్‌ దేవరకొండ కూడా ఒక సినిమాకి భయపడి తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం కాస్త డిలే అవడంతో రీ షెడ్యూల్‌ చేసి జులై 19న విడుదల చేయాలని భావించారట. అయితే ఆ వారాంతంలోనే 'ది లయన్‌ కింగ్‌' చిత్రం రిలీజ్‌ వుండడంతో వాయిదా వేసుకోకపోతే ఓవర్సీస్‌ బిజినెస్‌పై ఆశలు వదిలేసుకోవచ్చని చెప్పారట.

జెర్సీ వచ్చిన మరుసటి వారం అవెంజర్స్‌ రిలీజ్‌ అయితే మార్కెట్‌కి ఎంత రంధ్రం పడిందనేది తెలిసిందే. ఆ ఉదాహరణ చూపించి 'లయన్‌ కింగ్‌'కి ఎదురు వెళ్లవద్దని, వెళితే ఓవర్సీస్‌తో పాటు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌కి కూడా గండి పడుతుందని హెచ్చరించారట. ఆ చిత్రానికి వున్న క్రేజ్‌ ఏమిటనేది స్టడీ చేసి 'డియర్‌ కామ్రేడ్‌'ని వారం వాయిదా వేసుకున్నారట. దేశీయ చిత్రాల బెడద లేకపోయినా కానీ డిస్నీ, మార్వల్‌ సినిమాలు వస్తున్నపుడు మాత్రం తెలుగు నిర్మాతలు తమ ప్లాన్స్‌ మార్చుకోవాల్సి వస్తోంది. ఓవర్సీస్‌ మార్కెట్‌తో పాటు మల్టీప్లెక్స్‌ రెవెన్యూ కూడా కీలకంగా మారిన తరుణంలో చిన్న ఛాన్స్‌ కూడా తీసుకునేలా లేదు పరిస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English