తప్పించుకు తిరుగుతోన్న చిరంజీవి

తప్పించుకు తిరుగుతోన్న చిరంజీవి

పవన్‌కళ్యాణ్‌ ఓటమి చిరంజీవి మెడకి చుట్టుకుంది. రాజకీయాల్లో వైఫల్యం చెంది, మళ్లీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిన చిరంజీవితో రాజకీయాలు మాట్లాడించడానికి తమ్ముడు రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్టుంది. ఇద్దరు తమ్ముళ్లు కలిసి మూడు చోట్ల ఓడిపోయి మెగా ఫ్యామిలీకి ఎందుకొచ్చిన రాజకీయాలని అందరితో అనిపించుకుంటోన్న టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పరాజయం గురించి చిరంజీవితో మాట్లాడించాలని మీడియా చాలా ట్రై చేస్తోంది. ఎన్నికలకి ముందు తమ్ముడి రాజకీయం గురించి మాట్లాడాల్సి వస్తుందని చిరంజీవి ఏ పబ్లిక్‌ మీటింగ్‌కీ రాలేదు.

తీరా ఇప్పుడు పవన్‌ ఓటమి పాలవడంతో దాని గురించి చిరంజీవి బైట్‌ తీసుకోవడానికి ఆయన ఇంటి బయట చాలా మంది మీడియా వాళ్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బయటకి వస్తే తనతో ఏదో ఒకటి మాట్లాడించేస్తారని చిరంజీవి అన్నిటినీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏ వేడుకకి ముఖ్య అతిథిగా రమ్మన్నా కానీ తనకి సైరా షూటింగ్‌ వుందని చెప్పి చిరంజీవి దాట వేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎంతగా తప్పించుకున్నా కానీ సైరా రిలీజ్‌ టైమ్‌కి ప్రమోషన్ల కోసమైనా మీడియా ముందుకి చిరంజీవి రాక తప్పదు. అప్పుడయినా ఈ టాపిక్‌ గురించి మాట్లాడక తప్పదు. ఇప్పుడున్నంత వేడి వుండదేమో కానీ మొత్తానికి మాట్లాడకుండా అవాయిడ్‌ చేయడమయితే జరిగే పని కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English