డైరెక్టర్‌కి చుక్కలు చూపిస్తోన్న నితిన్‌

డైరెక్టర్‌కి చుక్కలు చూపిస్తోన్న నితిన్‌

కథ ఓకే అయి ఎన్నో నెలలు అవుతున్నా కానీ మీన మేషాలు లెక్క పెట్టి 'భీష్మ' షూటింగ్‌ మొదలు పెట్టని నితిన్‌ వేరే ప్రాజెక్టులేవో చేయాలని చాలా బలంగా ప్రయత్నించాడు. అయితే అతనికి మరే సినిమా సెట్‌ కాకపోవడంతో ముందుగా భీష్మ చేస్తున్నాడు. దాదాపు ఆరు నెలలుగా బౌండ్‌ స్క్రిప్ట్‌ పట్టుకుని ఎదురు చూస్తోన్న వెంకీ కుడుములకి ఎట్టకేలకు నితిన్‌ లడ్డూ తినిపించాడు. అయితే సినిమా మొదలు పెట్టిన ఆనందం కంటే దానికి పెట్టిన డెడ్‌లైన్‌ ఆ యువ దర్శకుడికి పెద్ద హెడ్డేక్‌ అయిందని అంటున్నారు.

ఎలాగైనా ఈ చిత్రాన్ని డిసెంబర్‌లోగా విడుదల చేసేయాలని నితిన్‌ ఖచ్చితమైన కండిషన్‌ పెట్టాడట. ఈ ఏడాది తన సినిమా ఏదీ విడుదల కాలేదనే పేరు తనకి వద్దని, అంచేత డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేసుకోమని చెప్పాడట. తీరిగ్గా షూటింగ్‌ మొదలు పెట్టి మళ్లీ ఈ డెడ్‌లైన్స్‌ ఏమిటి? నాగశౌర్య నుంచి నితిన్‌కి అంటే ప్రమోషనే అని ఆనంద పడిన వెంకీ కుడుములకి ఈ సదరు సెటిలైన హీరోలతో చేస్తే ఎలా వుంటుందనే సరదా ఇప్పుడు తీరిపోతోందేమో. డిసెంబర్‌లో విడుదల చేయమని డెడ్‌లైన్‌ పెట్టాడు సరే... పక్క చూపులు చూడకుండా ఈ చిత్రం పూర్తయ్యే వరకు దీని మీదే భీష్ముడి దృష్టి వుంటుందా లేదా అన్నదే చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English