చదువుకోమంటున్నారట.. మాట వినొచ్చుగా

చదువుకోమంటున్నారట.. మాట వినొచ్చుగా

కేవలం 30 సెకన్ల వీడియోతో దేశాన్ని ఊపేసింది ప్రియ ప్రకాష్ వారియర్. ఆమె కన్ను గీటిన వీడియో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. అందులో అంత బాగా హావభావాలు పలికించిన ఈ టీనేజర్.. సినిమాలో ఇంకెలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఉంటుందో, ఎంత చక్కగా నటించి ఉంటుందో అనుకున్నారు. కానీ ‘ఒరు అడార్ లవ్’లో ఆమె యాక్టింగ్ చూసి జనాలు షాకైపోయారు.

కన్ను గీటడంలో మినహాయిస్తే ఆమెకు వేరే టాలెంట్స్ ఏమీ లేవని స్పష్టమైంది. సినిమా కూడా చెత్తగా ఉండటం.. ప్రియ పాత్ర తేలిపోవడంతో ‘ఒరు అడార్ లవ్’ డిజాస్టర్ అయింది. అంతకుముందు ప్రియతో సినిమాలు చేయాలనుకున్న వాళ్లందరూ వెనక్కి తగ్గారు. ప్రియతో యాడ్స్ కోసం ఎగబడ్డ వాళ్లు కూడా సైలెంటైపోయారు. ప్రియ వ్యక్తిత్వం గురించి ‘ఒరు అడార్ లవ్’ దర్శక నిర్మాతలు ప్రశ్నలు లేవనెత్తడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారింది.

మొత్తంగా చూస్తే ప్రియ వన్ ఫిలిం వండర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తనను చక్కగా చదువుకోమంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు చెబుతున్నట్లు ప్రియ వెల్లడించడం విశేషం. ‘‘చదువును మధ్యలోనే ఆపాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. అలా చేయడం వారికి ఇష్టం లేదు. నాకు చదువు చెప్పిన టీచర్ల అభిప్రాయం ఏంటంటే.. నేను నటన కంటే చదువులోనే చురుకుగా ఉంటానట. నటన ఆపేసి చదువుపై దృష్టిసారించాలని చెబుతున్నారు. కానీ అది వారి అభిప్రాయం. నాకు చదువు కంటే సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. నేనేమీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌ని కాను. కాలేజ్‌కి వెళుతున్నందుకు గ్రేస్‌ మార్కులు కూడా పడవు. నేను మరో ఏడాది లో డిగ్రీ పట్టా అందుకుంటాను’’ అని ప్రియ చెప్పింది.

ఆమె మాటల్ని బట్టి చూస్తే సినిమాల నుంచి తప్పుకునే ఉద్దేశాలేమీ లేనట్లుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియకు అవకాశాలిచ్చేవాళ్లెవరన్నదే ప్రశ్నార్థకం. బుద్ధిగా తల్లిదండ్రులు., ఉపాధ్యాయలు చెప్పినట్లు వినాలని జనాలు ఆమెకు సలహా ఇస్తున్నారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English