మెగా హీరోలకే అంకితమయిన దర్శకుడు

మెగా హీరోలకే అంకితమయిన దర్శకుడు

రవితేజతో వరుసగా రెండు సినిమాలు తీసిన హరీష్‌ శంకర్‌కి దర్శకుడిగా అతి పెద్ద బ్రేక్‌ గబ్బర్‌సింగ్‌తో దక్కింది. ఆ తర్వాత వెంటనే రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేసాడు. అది కానీ పెద్ద హిట్‌ అయి వుంటే హరీష్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకడై వుండేవాడు. కానీ అది ఫ్లాప్‌ అవడంతో ఆ తర్వాతి చిత్రాన్ని మెగా ఫ్యామిలీలో అప్పుడే ఫ్రెష్‌గా దిగిన సాయి ధరమ్‌ తేజ్‌తో చేసాడు.

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ తర్వాత మళ్లీ వెంటనే మెగా ఫ్యామిలీకే చెందిన అల్లు అర్జున్‌తో 'డిజె' తీసాడు. ఆ తర్వాత యువ హీరోలతో మల్టీస్టారర్‌ చేయాలని చూసాడు కానీ అది మెటీరియలైజ్‌ అవలేదు. చాలా కాలం వేచి చూసిన హరీష్‌ శంకర్‌కి మళ్లీ మెగా హీరోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వరుణ్‌ తేజ్‌ని వాల్మీకిగా తీర్చిదిద్దుతోన్న హరీష్‌ శంకర్‌ ఇప్పుడు చరణ్‌ తప్ప టాప్‌ మెగా హీరోలందరితో చేసేసినట్టే.

గబ్బర్‌సింగ్‌ చూసి ఇంప్రెస్‌ అయిన చిరంజీవి కూడా అప్పట్లోనే అతడిని కథ తీసుకుని రమ్మన్నాడు. వరుసగా మెగా హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తోన్న హరీష్‌ శంకర్‌ తదుపరి చిత్రంతో అయినా వేరే హీరోలని ఇంప్రెస్‌ చేసేందుకు ట్రై చేస్తాడో లేదో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English