మహేష్‌కి అతనిపై ఇంట్రెస్ట్‌ లేదంట

 మహేష్‌కి అతనిపై ఇంట్రెస్ట్‌ లేదంట

అర్జున్‌రెడ్డి చూసి ఫిదా అయిపోయిన మహేష్‌ ఆ డైరెక్టర్‌ సందీప్‌ వంగాని పిలిపించి మరీ ప్రశంసించాడు. మంచి కథ వుంటే కలిసి సినిమా చేద్దామని కూడా అన్నాడు. అతను ఆ ఆఫర్‌ ఇచ్చిన కొద్ది రోజులకే సందీప్‌ అతనికో కథ కూడా చెప్పాడు. కథ విన్న మహేష్‌ తన ఇతర కమిట్‌మెంట్స్‌ని బట్టి కబురు పంపిస్తానన్నాడు. కానీ ఇంతవరకు అతనికి కబురు వెళ్లలేదు.

మరోవైపు మహేష్‌ వేరే సినిమాలు అంగీకరిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి చిత్రం తర్వాత మళ్లీ వంశీ పైడిపల్లితోనే మహేష్‌ మరో చిత్రం చేస్తాడు. అది జనవరి నుంచి సెట్స్‌ మీదకి వెళుతుంది. వంశీతో సినిమా అంటే ఏడాది సమయం తీసుకుంటాడు కాబట్టి సందీప్‌తో సినిమా వున్నా కానీ అది ఈ రెండేళ్లలో అయితే వుండదు.

మహేష్‌ నుంచి కబురు రాకపోవడంతో సందీప్‌ వేరే సినిమా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ అయిన కబీర్‌ సింగ్‌ హిట్టయితే హిందీలోనే మరో చిత్రం చేయాలని చూస్తున్నాడు. అది అంతగా క్లిక్‌ కాకపోతే మళ్లీ తెలుగులోనే ఒక విభిన్నమైన సినిమా చేసేందుకు ప్రణాళిక రచించుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English