సైరా కోసం భరణి రంగంలోకి దిగాడే..

సైరా కోసం భరణి రంగంలోకి దిగాడే..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. విడుదలకు ఏడాది ముందే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్ని మురిపించింది చిరు బృందం. కానీ ఆ తర్వాత చప్పుడే లేదు. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అసలు డిస్కషనే లేదు. చిత్ర బృందం ఏ అప్ డేట్ ఇవ్వకుండా సైలెంటుగా షూటింగ్ చేసుకుంటోంది.

దీని రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ సైలెన్స్ వల్ల సినిమాకు బజ్ తగ్గిపోతుందేమో అన్న ఆందోళన మెగా అభిమానుల్లో ఉంది. చిరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాాడు కానీ.. ‘సైరా’ గురించి ఎక్కడా మాట్లాడకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. మిగతా చిత్ర బృందానిదీ అదే సైలెన్స్. ఇలాంటి తరుణంలో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడటం విశేషం.

భరణి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్చర్యకరంగా ‘సైరా’ గురించి మాట్లాడారు. తాను ‘సైరా’లో ఒక చక్కటి పాత్ర చేస్తున్న భరణి.. తన కెరీర్లో ఆ పాత్ర గుర్తుంచుకునేలా ఉంటుందన్నారు. ‘సైరా’ మెగాస్టార్ అభిమానుల అభిమానుల అంచనాల్ని మించి ఉంటుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా ఆలస్యం అవుతున్నందుకు నిరాశ చెందొద్దని.. ఆ నిరీక్షణకు తగ్గట్లే సినిమా గొప్పగా ఉంటుందని భరణి అన్నారు. చిత్ర బృందం సినిమా కోసం ఎంతో కష్టపడిందని.. ఆ కష్టానికి కచ్చితంగా ఫలితం దక్కుతుందని.. తెలుగు ప్రేక్షకులు గర్వించేలా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఉంటుందని భరణి చెప్పారు.

‘సైరా’లో అమితాబ్, జగపతిబాబు, సుదీప్, అనుష్క, నయనతార, తమన్నా.. ఇలా పెద్ద తారాగణమే ఉంది. అందులో భరణి చిన్న పాత్రే చేస్తుండొచ్చు. అలాంటి వ్యక్తి మొత్తం సినిమా గురించి వకాల్తా పుచ్చుకుని ఈ రేంజిలో మాట్లాడటం ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English