యువి క్రియేషన్స్.. ఏమిటీ ఆటలు?

యువి క్రియేషన్స్.. ఏమిటీ ఆటలు?

‘సాహో’ విడుదలకు ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. రెండు రోజుల్లో దీని టీజర్ కూడా రాబోతోంది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఒక పోస్టర్ కూడా వదిలారు. కానీ అందులో అందరు ప్రధాన టెక్నీషియన్స్ పేర్లూ ఉన్నాయి. కానీ సంగీత దర్శకుడి పేరు మాత్రం వేయలేదు. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు.

శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాలో భాగంగా ఉన్నపుడు కూడా వారి పేర్లను పోస్టర్ల మీద వేయలేదు. చివరికి దర్శకుడితో లంకె కుదరక వాళ్లు ముగ్గురూ సినిమా నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో ఎవరిని తీసుకున్నారన్నది స్పష్టత లేదు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ తొలి సినిమా ‘రన్ రాజా రన్’కు సంగీతం సమకూర్చిన జిబ్రాన్‌‌తోనే ఈ చిత్రానికి కూడా పని చేయించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే సంగీత దర్శకుడిగా ఎవరిని ఎంచుకున్నప్పటికీ.. ఈపాటికి స్పష్టత వచ్చి ఉండాలి.

కానీ ఇప్పటిదాకా సంగీత దర్శకుడెవరన్నది అధికారికంగా ప్రకటించనే లేదు. ఒకవేళ జిబ్రాన్ ఖరారై ఉంటే ప్రకటించడానికి ఇబ్బందేంటి? రేప్పొద్దున టీజర్ రిలీజవుతుంది. అప్పుడు కూడా సంగీత దర్శకుడి పేరును ప్రకటిస్తారో లేదో అన్న డౌట్ ఉంది. రెండు రోజుల ముందు పోస్టర్లో వేయని పేరును.. టీజర్లో మాత్రం ఎలా చూపిస్తారని ఆశిస్తాం? ఐతే ‘సాహో’ టీజర్ అప్ డేట్ గురించి జిబ్రాన్ సోషల్ మీడియాలో చాలా ఎగ్జైట్ అవుతూ ఒక ట్వీట్ పెట్టడం విశేషం. అతడి ఎగ్జైట్మెంట్ చూస్తే సినిమాలో అతను భాగం అయినట్లే కనిపిస్తున్నాడు.

కానీ అతడి పేరును ఇంకా ప్రకటించకపోవడం అవమానించడమే. ‘సాహో’ అప్ డేేట్స్ ఇవ్వడంలో, ప్రమోషన్లు చేయడంలో యువి క్రియేషన్స్ తీరు మొదట్నుంచి విమర్శల పాలవుతోంది. ‘బాహుబలి’ని ఆ చిత్ర నిర్మాతలు ప్రమోట్ చేసిన తీరును గుర్తు చేస్తూ వీరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు అభిమానులు. ఇంత వరకు ఎలా జరిగినా.. విడుదల దగ్గర పడుతున్నపుడు కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాత్రం తప్పే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English