బుమ్రాతో ఎఫైర్.. అనుపమ ఏమందంటే?

బుమ్రాతో ఎఫైర్.. అనుపమ ఏమందంటే?

క్రికెటర్లకు, సినిమా అమ్మాయలతో సంబంధాలు కొత్తేమీ కాదు. కొన్నిసార్లు చాలా విచిత్రంగా.. సంబంధం లేని వ్యక్తుల మధ్య ఎఫైర్లు నడుస్తుంటాయి. ఒకప్పుడు నగ్మాతో సౌరభ్ గంగూలీ ఎఫైర్ అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది నిజం కాదనే చాలామంది అనుకున్నారు. కానీ వాళ్లిద్దరి మధ్య నిజంగానే వ్యవహారం నడిచిందని తర్వాతి పరిణామాలు వెల్లడించాయి.

ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఇలాంటి ఎఫైర్లు మరెన్నో ఉన్నాయి. తాజాగా ఒక విచిత్రమైన జోడీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రా.. మలయాళ కథానాయిక అనుపమ పరమేశర్వన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ప్రపంచకప్ టైంలో బుమ్రా బాగా హైలైట్ అవుతున్న సమయంలోనే అతడి ఎఫైర్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎప్పుడూ క్రికెట్‌తో తీరిక లేకుండా ఉండే నార్త్ ఇండియన్.. దక్షిణాదిన సినిమాల్లో బిజీగా ఉండే అనుపమతో ఎఫైర్ నడపడేమేంటి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఇలాంటి వార్తలపై చర్చిం చుకోవడం నెటిజన్లకు చాలా ఆసక్తి కాబట్టి ప్రచారం హోరెత్తిపోయింది. ఐతే రోజు రోజుకూ ప్రచారం పెరుగుతుండటంతో అనుపమ స్వయంగా స్పందించడం విశేషం.

అసలు బుమ్రాతో తనకు పరిచయమే లేదు అని కొట్టి పారేయకుండా అతను తనకు మంచి ఫ్రెండ్ అని ఆమె చెప్పడం విశేషం. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె ఓ ఇంగ్లిష్ డైలీకి వెల్లడించింది. సోషల్ మీడియాలో ఊరికే అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ల వల్ల ఎవరికీ ఏ ఉపయోగం ఉండదంటూ ఆమె తన అసహనాన్ని ప్రకటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English